ETV Bharat / entertainment

చిత్ర పరిశ్రమలో అలా జరగాలని కోరుకుంటున్నా : సమంత

ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయంపై మాట్లాడిన హీరోయిన్ సమంత!

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Samantha Citadel - Honey Bunny Trailer
Samantha Citadel - Honey Bunny Trailer (source ANI)

Citadel - Honey Bunny Trailer : బాలీవుడ్​ హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్ సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ సిటడెల్‌: హనీ-బన్నీ. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఇది తెరెకక్కింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో లాంఛ్ ఈవెంట్​ నిర్వహించి దీనిని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లో వరుణ్‌, సమంత అదరగొట్టారు.

ఈ లాంఛ్ ఈవెంట్​లో సమంతకు 'ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న' ప్రశ్న ఎదురైంది. దీనిపై సామ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో కలిసి పని చేసే అవకాశం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగమైనందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. "చిత్ర పరిశ్రమలో అందరికీ సమాన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే కొంత మార్పు కనపడుతోంది. అందులో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది. మన టాలెంట్​ మనం ఏంటనేది తెలియజేస్తుంది" అని చెప్పింది.

'సిటడెల్‌' సిరీస్​ గురించి కూడా సమంత మాట్లాడింది. "స్పై జానర్‌కు చెందిన వెబ్‌ సిరీస్‌ అయినా లేదా సినిమా అయినా ఎప్పుడూ మగ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఎందుకంటే వారే యాక్షన్‌ సీక్వెన్స్​లను చేస్తుంటారు. డైలాగ్స్‌ చెబుతుంటారు. కానీ దానికి భిన్నంగా ఈ సిటాడెల్​ సిరీస్‌లో నేను కొంత యాక్షన్‌ సన్నివేశాలను చేశాను" అని సమంత చెప్పుకొచ్చింది.

కాగా, ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ సిటడెల్‌. దీనికి ఇండియన్‌ వెర్షన్​గా సిటడెల్‌ : హనీ -బన్నీ తెరకెక్కింది. దీని కూడా రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. కానీ ఇది మిక్స్​డ్​ రివ్యూస్​ను అందుకుంది. ఇకపోతే ఇండియన్ వెర్షన్ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ ప్రత్యేకంగా ఉంటాయని మూవీటీమ్ చెబుతోంది.

Samantha Upcoming Movies : సమంత తన సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే యాక్షన్​ సినిమాను ఆ మధ్య అనౌన్స్ చేసింది. ఇందులోనూ ఆమె యాక్షన్ సీక్వెన్స్​లలో కనిపించనుంది. ఇంకా అనిల్‌ బర్వే దర్శకత్వంలో రానున్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ సమంత నటించనున్నట్లు సినీ వర్గాల్లో ఆ మధ్య గట్టిగానే ప్రచారం సాగింది. ఇందులో మీర్జాపూర్‌ ఫేమ్‌ అలీ ఫజల్‌ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ఇవి ఇంకా చిత్రీకరణలను ప్రారంభించుకోలేదు.

వరుణ్, సమంత - సింగిల్ షాట్​లో 11 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్​

రామ్​చరణ్​తో పోటీకి దిగనున్న నాగచైతన్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.