ETV Bharat / entertainment

అమెజాన్​లో సమంత 'సిటాడెల్' హవా- వారంలోనే వరల్డ్​ రికార్డ్! - CITADEL HONEY BUNNY OTT

అమెజాన్​లో సమంత సిటాడెల్ హవా- వరల్డ్​వైడ్​గా అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా రికార్డు

Citadel Honey Bunny
Citadel Honey Bunny (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 10:37 AM IST

Citadel Honey Bunny Records : స్టార్ హీరోయిన్ సమంత- బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌ లీడ్​ రోల్స్​లో నటించిన వెబ్‌ సిరీస్‌ 'సిటడెల్‌: హనీ బన్నీ'. స్పై అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది. నవంబర్ 06 నుంచి ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రిలీజైన తొలి వారంలోనే ఈ సిరీస్ అద్భుతమైన ఘనత దక్కించుకుంది.

అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'సిటాడెల్ : హనీ బన్నీ'కి ​ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్​వైడ్​గా అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా సిటాడెల్ హనీ బన్నీ అరుదైన రికార్డు కొట్టింది. ఆల్ఓవర్ వరల్డ్​లో దాదాపు 200 దేశాల్లో ఈ సిరీస్ రిలీజైంది.

ఇక భారత్​ సహా 30 దేశాల్లో అమెజాన్ చార్ట్స్​లో నెం.1లో స్ట్రీమింగ్ అవుతోంది. 150 దేశాల్లో టాప్ 10లో స్ట్రీమింగ్ ఇది స్ట్రీమింగ్ అవుతోంది. అందులో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, అస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, యూఏఈ వంటి దేశాలు ఉన్నాయి. అటు నాన్ ఇంగ్లీష్ వెర్షన్​లో కూడా ఈ సిరీస్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

కాగా, ఈ వెబ్​సిరీస్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్‌ సిరీస్‌'సిటడెల్‌'కు ఇది ఇండియన్‌ వెర్షన్‌. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతోపాటు బాలీవుడ్​ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్​సిరీస్​లో సమంత నటనకుగాను ప్రశంసలు దక్కుతున్నాయి.

స్టోరీ ఏంటంటే?
హనీ (సమంత) నైనిటాల్‌లోని ఓ కెఫేలో పనిచేస్తుంటుంది. ఆమెకు నాడియా (కశ్వీ మజ్ముందార్‌) అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన సమయంలో హనీని ఓ వ్యక్తి అనుసరిస్తూ ఉంటాడు. అది గమనించిన ఆమె అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పట్టుబడుతుంది. అయితే ఆ చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్తుంది. కానీ హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికీ వెళ్తారు.

మరోవైపు విదేశాల్లో ఉన్న బన్నీ చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అయితే హనీ వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? ఎంతటి వారితోనైనా పోరాడే సామర్థ్యం ఆమెకు ఎలా వచ్చింది? ఆమె గతం ఏంటి? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న విషయాలు తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే!

సినిమాగా రానున్న 'సిటడెల్‌' పార్ట్‌2!- హీరో హింట్ నిజమేనా?

'సిటాడెల్​లో నటించడం ఓ సవాలు- అలాంటి పాత్రలు చెయ్యను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.