ETV Bharat / entertainment

లావణ్య త్రిపాఠితో లవ్​ - వరుణ్ తేజ్​పై కోపం పెంచుకున్న చిరు! - Varuntej Operation Valentine

Chiranjeevi Varuntej Operation Valentine : లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్​ ప్రేమాయణం నడిపిన విషయమై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. వరుణ్​పై తనకు చాలా కోపంగా ఉందన్నారు. ఇంకా ఏమన్నారంటే?

లావణ్య త్రిపాఠితో లవ్​ - వరుణ్ తేజ్​పై కోపంగా ఉందన్న చిరు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 9:21 AM IST

Updated : Feb 26, 2024, 11:44 AM IST

Chiranjeevi Varuntej Operation Valentine : మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్‌ తేజ్‌ తన తొలి సినిమా ముకుందాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కంచె సినిమాతో సక్సెస్​ను ఖాతాలో వేసుకుని విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. అనంతరం ఫిదాతో కమర్షియల్‌ హిట్​ను అందుకుని స్టార్ ఇమేజ్​ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత తొలిప్రేమ, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3తో చిత్రాలతో మెప్పించిన ఆయన ఇప్పుడు ఆపరేషన్‌ వాలెంటైన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ ఆపరేషన్‌ వాలెంటైన్‌ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్​ నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేసి ఆసక్తికర విషయాలను చెప్పారు. అదే సమయంలో యాంకర్ సుమ చిరుకు కొన్ని సరదా ప్రశ్నలు కూడా వేసింది. ఇందులో భాగంగా వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి ప్రేమ విషయాన్ని ప్రస్తావించింది. చిరు లీక్స్ అంటే మాకు చాలా ఇష్టం. మరి మాకు వరుణ్‌ లవ్‌ లీక్‌ ఇవ్వలేదు. ఆ లీక్‌ మీకు రాలేదా? అన్ని సరదాగా అడిగింది.

అప్పుడు చిరు మొదటి సారి వరుణ్‌ లవ్‌ స్టోరీపై స్పందించారు. "సాధారణంగా వరుణ్‌ తేజ్‌ నాతో అన్ని విషయాలను పంచుకుంటాడు. వాళ్ల నాన్నకు చెప్పలేనివి కూడా నాతో చెప్తాడు. నేనే ఇన్​స్పిరేషన్ అంటుంటాడు. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నా దగ్గర దాచాడు. అదే నాకు కోపంగా ఉంటుంది" అంటూ మెగాస్టార్ సరదాగా బదులిచ్చారు. దీనికి వరుణ్‌ తేజ్‌ స్పందిస్తూ అది భయంతో కూడిన గౌరవమని, అయినా తన ప్రేమ విషయాన్ని ముందుగా పెదనాన్నతోనే చెప్పినట్టు వివరించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ బాగా వైరల్ అవుతున్నాయి.

కాగా, ఆపరేషన్‌ వాలెంటైన్​ సినిమా విషయానికొస్తే శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఎయిర్‌ ఫోర్స్ బ్యాక్​డ్రాప్​తో ఈ చిత్రం రూపొందింది. ఇందులో వరుణ్​ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా నటించారు. మనూషీ చిల్లర్‌ హీరోయిన్‌గా నటించింది. నవదీప్‌ కీలక పాత్ర పోషించారు. మరి వరుస పరాజయాల్లో ఉన్న వరుణ్​కు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీలో హార్ట్ బీట్ పెంచే హారర్ మూవీస్​ - అక్కడ ఫ్రీగా చూడొచ్చు!

ఈ వారం ఓటీటీలో 30కుపైగా సినిమా/సిరీస్​లు - ఆ రెండిటిపైనే అందరి ఫోకస్!

Last Updated : Feb 26, 2024, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.