ETV Bharat / entertainment

OTTలో ఫ్రీగా చిరంజీవి బ్లాక్‌ బ‌స్ట‌ర్ మూవీ - ఆఫర్​ రెండు రోజులు మాత్ర‌మే - OTT Chiranjeevi Movie - OTT CHIRANJEEVI MOVIE

SunNxt Chiranjeevi Movie : చిరు ఫ్యాన్స్​తో పాటు ఓటీటీ ప్రియులకు వీకెండ్​ ఆఫర్​ను ఇచ్చింది సన్​నెక్స్ట్. చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్​ మూవీని ఫ్రీగా చూసేలా అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు, మెంబ‌ర్‌ షిప్ కూడా అవ‌స‌రం లేద‌ని వెల్లడించింది.

source ETV Bharat
Chiranjeevi (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 12:06 PM IST

SunNxt Chiranjeevi Movie : మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్​లో ఎన్నో సూపర్ హిట్​లు, బ్లాక్ బస్టర్​లు, ఇండస్ట్రీ హిట్​ చిత్రాలు ఉన్నాయి. ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్నా ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'(Chiranjeevi Viswambara) అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్​గా ఆయన పుట్టినరోజు(ఆగస్ట్​ 22) వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు గ్రాండ్​గా చేసుకున్నారు.

Shankar Dada M.B.B.S. Movie : అయితే ఈ నేఫథ్యంలోనే చిరు ఫ్యాన్స్​తో పాటు ఓటీటీ ప్రియులకు వీకెండ్​ ఆఫర్​ను ఇచ్చింది సన్​నెక్స్ట్​. చిరు నటించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు, మెంబ‌ర్‌ షిప్ అవ‌స‌రం లేద‌ని వెల్లడించింది. అయితే ఈ ఆఫ‌ర్ మూడు రోజులు మాత్ర‌మే అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చింది. కేవలం ఆగ‌స్ట్ 23, 24, 25 తేదీల్లో మాత్ర‌మే అని తెలిపింది.

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌తో పాటు కోలీవుడ్ హీరో జీవా న‌టించిన త‌మిళ చిత్రం 'శివ మ‌న‌సుల‌ శ‌క్తి' కూడా ఈ సన్​ నెక్ట్స్​ వీకెండ్‌లో ఫ్రీగా చూడొచ్చని తెలిపింది.

కాగా, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ 2004లో విడుదలైన సంగతి తెలిసిందే. జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. కామెడీ ఎమోష‌న‌ల్ డ్రామాగా ఇది రూపొందింది. సినిమాలో చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే నటించింది. శ్రీకాంత్‌, ప‌రేశ్ రావ‌ల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ‌ర్వానంద్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క‌లెక్ష‌న్స్​ కూడా బానే వసూలు అయ్యాయి. ఈ చిత్రం రీ రిలీజ్​లోనూ మంచి కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా హిందీలోనూ ఉంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ పేరుతో రూపొందింది. ఇందులో సంజ‌య్‌ ద‌త్ హీరోగా నటించారు.

ప్రభాస్ 'జోకర్' - అర్షద్ వార్సి కాంట్రవర్సీ కామెంట్స్​పై ​స్పందించిన నాగ్​ అశ్విన్​ - Prabhas Joker Controversy

'విశ్వంభర' అలా ఉంటుంది : సూపర్ అప్డేట్ ఇచ్చిన వశిష్ఠ - Viswambhara Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.