ETV Bharat / entertainment

టాలీవుడ్​లో ఆ రికార్డ్​ సాధించిన తొలి హీరో​ చిరంజీవినే - ఇంతకీ అదేంటంటే? - Tollywood First 50 crore collection

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 6:30 PM IST

Chiranjeevi Indra ReRelease : టాలీవుడ్​లో రూ.50కోట్లు వసూళ్లు సాధించిన తొలి సినిమా​ చిరంజీవిదే. ఇప్పుడు ఆ చిత్రం రీరిలీజ్​కు రెడీ అయింది. ఈ సందర్భంగా ఆ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Chiranjeevi Indra ReRelease (source ETV Bharat)

Chiranjeevi Indra ReRelease : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అందులో ఇంద్ర ఒకటి. ఇప్పుడీ సినిమాకు 22 ఏళ్లు. ఈ సందర్భంగా మూవీ రిరీలీజ్‌ డేట్‌ను వైజయంతీ మూవీస్‌ సంస్థ అనౌన్స్ చేసింది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న మళ్లీ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంద్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

  • ముందుగా చిన్ని కృష్ణ ఓ కథను నిర్మాత అశ్వనీదత్‌, దర్శకుడు బి. గోపాల్‌కు వినిపించారు. కానీ అప్పటికే మెకానిక్‌ అల్లుడుతో చిరంజీవికి హిట్‌ ఇవ్వలేకపోయాన్న బాధ బి గోపాల్​లో ఉంది. దీంతో ఈ సినిమా చేసేందుకు బి. గోపాల్‌ వెనకడుగు వేశారు. కానీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆయనకు నచ్చజెప్పి ఒప్పించారు. దీంతో చిన్ని కృష్ణ కథను మరింత డెవలప్‌ చేసి ఇంద్రగా రూపొందించారు.
  • ఈ సినిమా బ్యాక్​డ్రాప్​ కోసం కృష్ణా- గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని మొదట ఎంచుకున్నారు. కానీ ఆ తర్వాత కాశీ, గంగానది బ్యాక్‌డ్రాప్​గా మార్చారు.
  • చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.7 కోట్లు.
  • చిరంజీవి - వైజయంతీ బ్యానర్‌ కాంబోలో ఇది మూడో చిత్రం. అంతకుముందు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది చిత్రాలు వచ్చాయి.
  • నటుడు శివాజీ చేసిన పాత్రకు ముందుగా వెంకట్, రాజా తదితరులను అనుకున్నారు.
  • ఓ హీరోయిన్‌గా సిమ్రన్‌ను అనుకున్నారు. చివరికి ఆర్తి అగర్వాల్‌ ఫైనలైజ్ అయింది. మరో హీరోయిన్‌గా సోనాలి బింద్రేను ఫిక్స్ చేశారు.
  • మొత్తం 120 రోజుల్లో ఈ ఇంద్ర సినిమాను కంప్లీట్ చేశారు. మొత్తం పదకొండు పాటలు చేశారు. అందులో ఐదు పాటలను ఫైనలైజ్ చేశారు.
  • మణిశర్మ అందుబాటులో ఉండకపోవడం వల్ల అయ్యో అయ్యో సాంగ్​కు మాత్రం ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూర్చారు.
  • ఈ చిత్రం మొత్తం 268 స్క్రీన్‌లలో విడుదలైంది. అత్యధిక థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు పాటు ప్రదర్శితమైంది. అలానే పలు కేంద్రాల్లో 175 రోజులు కూడా ఆడింది.
  • ఈ చిత్రానికి విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు. హిందీలో ఇంద్ర : ది టైగర్‌గా, బెంగాలీలో సుల్తాన్‌గా రీమేక్ కూడా చేశారు.
  • ఈ చిత్రానికి మూడు విభాగాల్లో నంది అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా- చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్​గా - రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్​గా - పి రవి శంకర్ పురస్కారాలను దక్కించుకున్నారు.
  • సినిమా కలెక్షన్స్ వివరాల విషయానికొస్తే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు (గ్రాస్‌) సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత పోకిరి సినిమా దీన్ని అధిగమించింది.

టాలీవుడ్ హీరో మంచి మనసు - నెలకు నాలుగున్నర లక్షల ఫుడ్ ఫ్రీగా పంచుతూ! - Tollywood Hero Free Food Delivery

బాలయ్య 'BB4' కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.