Singer Highest Remuneration For Two Songs : ఆయన పాడిన పాటలు రెండే. అయితేనేం అలనాటి గాయకులు లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ల కన్నా 100 రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ప్రస్తుత సింగర్లు కూడా అంత మొత్తంలో పారితోషకం అందుకోలేదట. మరి అప్పట్లోనే అంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న సింగర్ ఎవరు? ఆయన ఏ సినిమాలోని పాటలు పాడారో? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
60 ఏళ్ల క్రితం అగ్ర గాయకులకు ఒక్కో పాటకు రూ. 250-300 రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చేవారట. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ కూడా కొంత ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకునేవారట. అయితే అప్పటి కాలంలోనే ఓ సింగర్ మాత్రం ఈ విషయంలో ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పటి అగ్ర సింగర్ల కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్‌ను తీసుకున్నారట. ఇంతకీ ఆయనెవరో కాదు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్.
1960 ఆగస్టు 5న విడుదలైన మూవీ మొఘల్-ఏ-ఆజామ్ సినిమాలోని 20 పాటలను పాటలను రూపొందించేందుకు స్వరకర్త నౌషాద్కు రూ. 3000 సొమ్మును (నేటి కరెన్సీలో దాదాపు రూ. 3 లక్షలకు సమానం) నిర్మాత కే ఆసిఫ్ అందజేశారు. ఇక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం బాగా వచ్చిన ఓ గాయకుడిని వెతికే పనిలో పడ్డారు నిర్మాత ఆసిఫ్, స్వరకర్త నౌషాద్. అప్పుడే వారికి ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గుర్తొచ్చారు. ఇక వెంటనే ఆయన్ను సంప్రదించగా, అలీఖాన్ పాటలు పాడేందుకు విముఖత చూపించారట. దీంతో వారిని ఒక్కో పాటకు రూ.25,000 రెమ్యూనరేషన్ ఇవ్వమని అడిగారట. కానీ ఉస్తాడ్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాత ఓకే చెప్పారట. అంతే కాకుండా వెంటనే 50 శాతం పేమెంట్‌ను అడ్వాన్స్‌గా చెల్లించారట.
ఇక ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ తన కెరీర్లో పాడినవి రెండు సాంగ్సే. అవి కూడా మొఘల్-ఏ- ఆజామ్లోనివే. ఈ సాంగ్స్‌కు అప్పట్లో రూ.50 వేలు తీసుకున్నారు అలీ ఖాన్. ఈ రెమ్యూనరేషన్ ప్రస్తుత కరెన్సీతో పోలిస్తే రూ. 50 లక్షల కంటే ఎక్కువే. బాలీవుడ్ టాప్ సింగర్స్ సునిధి చౌహాన్, అర్జీత్ సింగ్ కూడా ఒక్కో పాటకు ఇంత రెమ్యూనరేషన్‌ను తీసుకోవట్లేదని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తొలి సింగర్ - కానీ 13 ఏళ్లకే!