3 Crore Budget Bollywood Movie : బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా ఒక్కోసారి కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి అంచనాలకు మించి విజయం సాధించడం మనం చాలా సార్లు చూసుంటాం. 2011లోనూ ఓ సినిమా ఇలాంటి రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా ముగ్గురు స్టార్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ మూవీ 'ప్యార్ కా పంచ్ నామా' .
ఈ సినిమా ద్వారా లవ్ రంజన్ అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు మూడు కోట్లతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తొలి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమా పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. కానీ అదే సినిమా తర్వాతి రోజుల్లో మంచి వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది. అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 17.35 కోట్లు సాధించింది.
మరోవైపు ఈ సినిమా ద్వారా ముగ్గురు స్టార్స్ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ప్రస్తుతం వారందరూ బాలీవుడ్లో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకుని రాణిస్తున్నారు. వారెవరంటే ?
కార్తిక్ ఆర్యన్ : బాలీవుడ్‌కు చెందిన ఈ స్టార్ 'ఆకాశ్ వాణి', 'లవ్ ఆజ్ కల్', 'భూల్ భులయ్యా', 'షెహ్జాదా', 'సత్య ప్రేమ్ కీ కహానీ' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
దివ్యేందు శర్మ : తెలుగులో ఈ హీరో సినిమాలు చేయనప్పటికీ ఈయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. మీర్జాపుర్ సిరీస్‌లో మున్నాభాయ్‌గా కనిపించిన దివ్యేందు తన క్యారెక్టర్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. సిరీస్‌లతోనే కాకుండా పలు హిందీ సినిమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
నూష్రత్ భరుచా : తాజ్ మహాల్ అనే తెలుగు సినిమాలో మెరిసిన ఈ భామ, నెమ్మదిగా తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈమె 'జై సంతోషి మాత', 'ప్యార్ కా పంచ్ నామా', 'డ్రీమ్ గర్ల్', 'ప్యార్ కా పంచ్ నామా-2', 'డర్@షాపింగ్ మాల్', 'రామ్ సేతు' వంటి సినిమాలతో పాటు 'అజీబ్ దాస్తానీస్', 'ఛోరి' లాంటి సినిమాల్లో మెరిసింది. ఇటీవలే బెల్లకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ఛత్రపతి'లో హీరోయిన్‌గానూ అలరించారు.
ఒక్క పదానికి రూ. 75 లక్షలు - రెండు సినిమాలకు ఈ స్టార్ హీరో రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే ?
ఆ సినిమాపై 34 కేసులు, నటికి వేధింపులు - దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీ ఏదంటే ?