Star Heroine To Dancer: అలియా భట్ తండ్రి మహేశ్ భట్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కలియుగ్. పోర్నోగ్రఫీ మీద ధైర్యంగా, బోల్డ్‌గా చిత్రీకరించారు. ఈ సినిమా ఎంతో మంది స్టార్ల కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. వీరందరితో పాటు మరో నటి ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా డైరక్టర్ మోహిత్ సూరి, నటుడు ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ అలియా భట్‌కు బంధువైన స్మైల్ సూరి ఇండస్ట్రీకి అనుకుని రాకపోయినా అనుకోని రీతిలో సక్సెస్ అయింది.
కలియుగ్ సినిమా తర్వాత 'యే మేరా ఇండియా', 'తీస్రీ ఆంక్', 'క్రూక్' లాంటి సినిమాల్లో నటించింది. అలా క్రేజ్ దక్కించుకున్న స్మైలీ డౌన్‌టౌన్ సినిమాతో కనిపించడంతో పాటు టీవీ షోలు అయిన 'జోధా అక్బర్', 'నాచ్ బలియే'లలో మెప్పించింది. గ్రాండ్‌గా మొదలైన ఆమె కెరీర్ చివరికి సోషల్ మీడియా స్టార్‌గా మార్చింది. పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న డిప్రెషన్‌ను దాటి బయటపడ్డ ఆమె మీడియాతో ఇలా మాట్లాడింది.
'సెలబ్రిటీల విషయాలు కచ్చితంగా బయటకు చెప్పాలి. ఎందుకంటే వాళ్లను మీడియా ఫోకస్ చేస్తుంటుంది. మన ఫాలోవర్లకు వాస్తవం తెలియజేయాల్సిన బాధ్యత మనకుంటుంది. విడాకుల తర్వాత నా జీవితం మారిపోయింది. థైరాయిడ్ పెరిగి ఏం చేయాలన్నా సాధ్యపడలేదు. ఒకానొక రోజు నేను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. దీపికా పదుకొణె కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. జిమ్ క్యారీ, రాబిన్ విలియమ్స్ లాంటి వాళ్లు కూడా ఈ డిప్రెషన్ ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఈ పోల్ డ్యాన్స్ నాకు బాగా సహాయపడింది. శరీరంతో పాటు మానసికంగా కూడా బలపడ్డాను' అని వెల్లడించింది.
పర్సనల్ లైఫ్: 2014లో ఆమె యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి వినీత్ బంగేరాను వివాహం చేసుకుంది. ఆ బంధం సజావుగా సాగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. అలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన స్మైలీ తిరిగి తన కెరీర్ ఆరంభించింది. రీసెంట్‌గా షియామక్ దావర్ అనే వ్యక్తితో కలిసి సందీప్ సోపార్కర్ వద్ద ట్రైనింగ్ తీసుకుంది. 2018- 19 నుంచి ఫిట్‌నెస్ యాక్టివిటీ అయిన పోల్ డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. ఈ పోల్ డ్యాన్స్ వందలు, వేల లైకులు వచ్చిపడుతుండడం వల్ల ఆ రకంగానూ సంపాదిస్తుంది. 15ఏళ్ల విరామం తర్వాత రీసెంట్‌గా జీ5 నిర్మించిన 'హౌజ్ ఆఫ్ లైస్' లో కనిపించింది.
చేసిన ఐదు సినిమాలు ప్లాప్ - కానీ నయన్, తమన్నా కన్నా ఈమెకే క్రేజ్ ఎక్కువ! - Most popular Heroine