Bollywood Actor Debut In 41 : తనదైన స్టైల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తుంటారు ఈ బాలీవుడ్ స్టార్. హిందీలో పలు చిత్రాలను తన యాక్టింగ్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఈయన, తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయి ఆడియెన్స్ ప్రశంసలు పొందుంతుంటారు. తెలుగులోనూ ఓ గుర్తుండిపోయే పాత్ర ద్వారానే ఎంట్రీ ఇచ్చి ఇక్కడి వారికి దగ్గరయ్యారు. అయితే ఆ సినీ జర్నీ అంత సాఫీగా సాగలేదంట. 41 ఏళ్లకు తెరంగేట్రం చేసిన ఈయన సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అరుదైన వ్యాధితో సతమతం!
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ తాత పాత్రలో మెరిశారు బాలీవుడ్ హీరో బొమన్ ఇరానీ. అంతకముందు హిందీలో నటించినప్పటికీ, ఈ క్యారెక్టర్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. అయితే ఆయన సినీ ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్నప్పుడు డైస్లెక్సియా (లెర్నింగ్ డీజెబిల్టి) అనే అరుదైన వ్యాధిలో బాధపడేవారట. అంటే పదాలు లేదా సంఖ్యలను సరిగా గుర్తించకపోవడం, పలకక పోవడం వంటి ప్రధాన సమస్యతో ఇబ్బందిపడేవారట. ఆ తర్వాత కూడా బొమన్ ఇరానీ జీవితం అంత సాఫీగా సాగలేదు.
ఇక బొమన్ తన పాఠశాల విద్య తర్వాత రెండేళ్ల పాటు వెయిటర్ కోర్సును చేశారు. ఆ తర్వాత తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో వెయిటర్, రూమ్ సర్వీస్ స్టాఫ్‌గా కొంతకాలం పనిచేశారు. 1981- 1983 మధ్య హన్స్ రాజ్ సింధియా మార్గదర్శకత్వంలో యాక్టింగ్ నేర్చుకున్నారు. 1987-1989 వరకు ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోర్సు చేశారు. అలాగే తన తల్లికి బేకరీ, స్వీటు దుకాణంలో సాయంగా ఉండేవారు. దాదాపు 14 ఏళ్లపాటు స్వీటు షాపులోనే పనిచేశారు. ఆ తర్వాత యాక్టింగ్ ఆసక్తి పెరిగి నటన వైపునకు మళ్లారు.
Winter, Christmas Poje in London toh banta hai! pic.twitter.com/jpvp2XfnTF
— Boman Irani (@bomanirani) December 9, 2019
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారిలా!
తొలుత థియేటర్ నాటకాలలో ఫేమస్ అయిన బొమన్ ఇరానీ, ఆ తర్వాత 'ధర్నా మనా హై' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన 'లెట్స్ టాక్', 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగే రహో మున్నా భాయ్', '3 ఇడియట్స్', 'దోస్తానా', 'వక్త్' వంటి చిత్రాలలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇరానీ ఒక అద్భుతమైన నటుడే కాకుండా, దర్శకుడు, నిర్మాత కూడా తన సత్తా చాటుకున్నారు.