ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8 : ఈ సీజన్​లో పాల్గొనే కంటెస్టెంట్స్​ ఎవరో తెలుసా? - లిస్ట్​ మామూలుగా లేదు! - Bigg Boss 8 Contestants List - BIGG BOSS 8 CONTESTANTS LIST

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8కి కౌంట్‌ డౌన్ మొదలైంది. త్వరలో మొదలు కానున్న ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్​ లిస్ట్​ ఇదే అంటూ సోషల్​మీడియాలో ఓ రేంజ్​లో వైరల్​ అవుతున్నాయి. మరి ఆ లిస్ట్​లో ఎవరు ఉన్నారు? షో ఎప్పుడు స్టార్ట్​ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

Bigg Boss 8
Bigg Boss 8 (Bigg Boss 8)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 2:45 PM IST

Bigg Boss 8 Contestants List: బిగ్​బాస్​.. ఈ పేరు వింటే చాలా మందికి ఎక్కడలేని హుషారు వస్తుంది. కారణం.. అద్భుతమైన టాస్క్​లు.. ఆసక్తి రేకెత్తించే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎలిమినేషన్లు.. ఇలా ఒక్కటేమిటి 100రోజులకు పైగా మస్తు ఎంటర్​టైన్​మెంట్​ లభిస్తుంది. అందుకే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే షో ఎప్పుడు మొదలైనా అందులో పార్టిసిపేట్​ చేసే వాళ్లు ఎవరు? అని కొద్దిరోజుల ముందు నుంచే తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా.. సీజన్​ 8కి సంబంధించిన అఫీషియల్​ టీజర్​, ప్రొమో రిలీజ్​ కావడంతో.. ఇందులో పాల్గొనే వారి వివరాలపై ఇంకాస్త ఇంట్రస్ట్​ పెరిగింది. అయితే ఈసారి బిగ్​బాస్​ సీజన్​ 8 హోజ్​లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ సోషలమీడియాలో కొద్దిమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వాళ్లు ఎవరు? షో ఎప్పుడు స్టార్ట్​ అవుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పేర్లు ఇవే:

హీరో రాజ్ తరుణ్: టాలీవుడ్​ హీరో రాజ్​ తరుణ్.. ఈసారి బిగ్ బాస్ హౌజ్​లో స్టార్ అట్రాక్షన్ కాబోతున్నట్టుగా టాక్ వినబడుతోంది. ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామి’ సినిమాలు రిలీజ్ చేసిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

సద్దాం: పలు కామెడీ షోలలో పంచ్​లతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సద్దాం.. బిగ్ బాస్ సీజన్ 8లో కనిపించబోతున్నాడట. కమెడియన్ కోటాలో సద్దాంకి భారీగా పారితోషికం ఫిక్స్ చేశారని సమాచారం.

తేజస్వినీ గౌడ: తెలుగులో పలు సీరియల్స్‌తో సుపరిచతమైన తేజస్వినీ గౌడ.. ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్‌7లో రన్నరప్​గా నిలిచిన అమర్​దీప్​ భార్యే ఈ తేజస్వినీ. ఈసారి కప్పు కొట్టి భర్త కల నెరవేర్చాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందట.

రీతూ చౌదరి: పలు టీవీ షోలలో మంచి ఆర్టిస్ట్​గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. బిగ్​బాస్​లోకి అడుగు పెడుతున్నట్లు టాక్​. అంతేకాదు ఈ హాట్​బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

యష్మీ గౌడ: తెలుగు సీరియల్స్, పలు రియాలిటీ షోల ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఈసారి బిగ్ బాస్ హౌజ్​లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్.

బిగ్​బాస్​ లోకి వేణు స్వామి - ఈ సారి ఊహకందని కంటెస్టెంట్స్​ లిస్ట్!

సనా: తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నటి సనా కూడా సీజన్​ 8లో పాల్గొననున్నట్ల సమాచారం.

విష్ణుప్రియ: యాంకర్​గా, హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన విష్ణు ప్రియకి బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. అందులోకి వెళ్లేందుకు కూడా ఒప్పుకున్నట్లు టాక్​ వినిపిస్తోంది.

వీరు కూడా: పైన చెప్పినవారితో పాటు సీరియల్​ నటుడు నిఖిల్, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, కమెడియన్ యాదమ రాజు, కిర్రాక్ ఆర్పీ, ఆలీ తమ్ముడు ఖయ్యూం, బర్రెలక్క, కుమారి ఆంటీ, యాంకర్ వింద్య, అమృత ప్రణయ్, యూట్యూబర్ సోనియా సింగ్​, జ్యోతిష్యుడు వేణు స్వామి సహా పలువురు బిగ్​బాస్​ హోజ్​లకి వెళ్లబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

షో అప్పుడే మొదలు: సీజన్​ 7లో "ఉల్టా పుల్టా" కాన్సెప్ట్​ తీసుకురాగా.. ఈసారి సీజన్​ 8లో "ఇక్కడ ఒక్కసారి కమిట్​ అయితే లిమిటే​ లేదు" అనే కాన్సెప్ట్​తో వస్తున్నారు. అయితే బిగ్ బాస్ 4వ సీజన్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జులై 16 ప్రారంభం కాగా.. రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జులై 21న ప్రారంభ అయ్యింది. సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్​లోనే స్టార్ట్​ కానుందట. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్​.

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.