ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: ముగిసిన ఓటింగ్​ - ఆ ఇద్దరి మధ్యనే టైటిల్ వార్! - BIGG BOSS 8 WINNER VOTING RESULTS

-మరికొన్ని గంటల్లో ముగియనున్న బిగ్​బాస్​ సీజన్​ 8 - విన్నర్​ ఆ ఇద్దరిలోనే అంటున్న నెటిజన్లు!

Bigg Boss 8 Telugu Winner Voting Results
Bigg Boss 8 Telugu Winner Voting Results (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Bigg Boss 8 Telugu Winner Voting Results: బిగ్‏బాస్ సీజన్ 8కు మరికొన్ని గంటల్లో ఎండ్​కార్డ్​ పడనుంది. డిసెంబర్ 15న అట్టహాసంగా జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ విన్నర్​ ఎవరో తేలనుంది. ప్రస్తుతం హౌజ్​లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండగా.. అన్​అఫీషియల్​ పోలింగ్​లో ఇద్దరు హోరాహోరీగా తలపడుతున్నారు. మరి విజేత కాబోయేది ఎవరో చూద్దాం..

ప్రస్తుతం హౌజ్​లో టాప్​ 5 ఫైనలిస్టులుగా అవినాష్​, నిఖిల్​, గౌతమ్​, ప్రేరణ, నబీల్​ మిగిలారు. వీరిలో విన్నర్​ ఎవరో తేల్చేందుకు గత ఆదివారం అర్ధరాత్రి నుంచి పోలింగ్​ స్టార్ట్​ అయ్యింది. సుమారు 5 రోజులపాటు సాగిన ఓటింగ్​ శుక్రవారం అర్ధరాత్రితో క్లోజ్​ అయ్యింది. తమ ఫేవరెట్​ కంటెస్టెంట్​ను గెలిపించుకునేందుకు ఆడియన్స్​ అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. అయితే.. ఈ ఐదుగురిలో ఇద్దరే దాదాపు 80 శాతం ఓట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. వారే.. నిఖిల్​ అండ్​ గౌతమ్​!

షో మొదలైనప్పటి నుంచి ఉన్న నిఖిల్​, వైల్డ్​ కార్డ్​ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్​ మధ్య పోటీ చాలా టఫ్​గా ఉంది. సాధారణంగా విన్నర్​ ఓటింగ్​ మొదలైన తర్వాత.. రెండు మూడు రోజుల్లోనే విజేత ఎవరో ఓ అంచనా వచ్చేస్తుంది. కానీ.. ఇప్పుడు ఈ సీజన్​లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ​ గౌతమ్, నిఖిల్ ఇద్దరూ స్వల్ప ఓటింగ్ తేడాతో.. టాప్ ప్లేస్​లో దూసుకుపోతున్నారు. మూడు రోజులపాటు ఓటింగ్​ మామూలుగానే జరిగినా.. ఆఖరు రోజు మాత్రం టాప్ 2 కంటెస్టెంట్స్ ఓటింగ్ విపరీతంగా పెరిగింది. ఈ రేంజ్​లో ఓటింగ్​ నమోదైన విన్నర్​ ఎవరనేది మాత్రం స్పష్టం కావడం లేదు. యూట్యూబ్​ ఓటింగ్​లో గౌతమ్​.. సోషల్ మీడియాలో నిఖిల్​ విజేత అన్నట్టుగా ఉంది పరిస్థితి.

ఎవరికి అవకాశం ఎక్కువ: షో మొదలైనప్పటి నుంచి టైటిల్​ రేస్​లో నిఖిల్​ ముందంజలో ఉన్నాడు. గేమ్స్​ పరంగా, బిహేవియర్​ పరంగా హీరోగా మారాడు. గేమ్​ ఏదైనా సరే స్ట్రాంగ్​ కంటెస్టెంట్​ అనే పేరు తెచ్చుకున్నాడు. ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్​ చేసినా ఏదీ పట్టించుకోకుండా గేమ్​ మీద ఫోకస్​ చేసి విన్నర్​ రేస్​లో ఉన్నాడు. ఇప్పటివరకు ఎలిమినేట్​ అయిన చాలా మంది నిఖిల్​ విన్నర్​ మెటిరీయల్​ అని చెప్పినవాళ్లే.

ఇక గౌతమ్​ సంగతి చూస్తే.. గత సీజన్​లో కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 వారాలపైనే హౌజ్​లో ఉన్నాడు. ఈ సీజన్​లో వైల్డ్​కార్డ్​గా ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట తీరు, ప్రవర్తనతో ఆడియన్స్​లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫలితంగా గత సీజన్​లో లభించని ప్రేక్షకాదరణ.. ఇప్పుడు లభించి విన్నర్​ రేస్​లో ఉన్నాడు.

అయితే.. నిఖిల్​ విన్నర్​ కావడానికే అవకాశం ఎక్కువ అంటున్నారు కొందరు. ఎందుకంటే.. అతను ​ ముందు నుంచి గేమ్​లో ఉన్నాడని.. గౌతమ్​ వైల్డ్​కార్డ్​ ద్వారా వచ్చాడు కాబట్టి అతడికి ఛాన్స్​ లేకపోవచ్చని అంటున్నారు. మరి, టైటిల్ అందుకునేది ఎవరో చూడాల్సి ఉంది.

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

బిగ్​బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ,​ పృథ్వీరాజ్​ బ్రేకప్​ - అర్ధరాత్రి ఏం జరిగింది?

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.