Bigg Boss 8 Telugu Prize Money: ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ మొదలైన బిగ్‌బాస్ సీజన్ 8కు మరికొన్ని గంటల్లో శుభం కార్డ్ పడనుంది. ఈ షోలో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయగా వారిలో ఐదుగురు అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఇక వీరిలో నిఖిల్, గౌతమ్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రైజ్‌మనీని హోస్ట్ నాగార్జున రివీల్ చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కాన్సెప్ట్ ఇన్ఫినిటీ. అంటే అన్‌లిమిటెడ్ ఫన్, అన్‌లిమిటెడ్ ట్విస్టులతోపాటు అన్‌లిమిటెడ్ ప్రైజ్ మనీ. అయితే గత ఏడు సీజన్లు చూస్తే.. బిగ్‌బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దాదాపుగా రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ వచ్చింది. కానీ, ఈ సీజన్లో మాత్రం కంటెస్టెంట్ల ఆట తీరును బట్టి ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. అంటే, కంటెస్టెంట్స్ ఎంత సంపాదించుకుంటే అంతగా బిగ్‌బాస్ 8 తెలుగు విజేత ప్రైజ్ మనీ ఉంటుంది.
ఆ లెక్క ప్రకారమే షో మొదలైన రోజు నుంచి నేటి వరకు ప్రైజ్‌మనీ పెంచుకునేందుకు వివిధ రకాలు గేమ్స్ ఆడారు కంటెస్టెంట్లు. అలా ఫినాలే వీక్ వరకు హౌజ్‌మేట్స్.. రూ.54 లక్షల 30 వేల వరకు ప్రైజ్‌మనీని సంపాదించారు. అయితే అది ఫిక్స్ కాదని.. గ్రాండ్ ఫినాలే వరకు యాడ్ అవ్వొచ్చు తగ్గొచ్చని.. టాప్-5 ఎలా ఆడతారో దాన్ని బట్టే ప్రైజ్ మనీ టోటల్ ఫిక్స్ అవుతుందని నాగ్ చెప్పారు. ఆ విధంగానే ఫినాలే వీక్‌లో ప్రైజ్ మనీ పెంచుకునేందుకు బీబీ పరివారానికి, మా పరివారానికి పలు గేమ్స్ పెట్టగా అందులో హాజ్మేట్స్ గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకున్నారు. అయితే అప్పటివరకు కూడా గెలిచిన అమౌంట్ ఎంత అనేది తెలియదు. తాజాగా ఆ విషయాన్ని నాగార్జున అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో దీనిని రివీల్ చేశారు. మొత్తం ప్రైజ్ మనీ రూ.54,99,999 ఉండగా.. మరో రూపాయి యాడ్ చేసి రూ.55 లక్షలు చేశారు. అలాగే ఈ సీజన్ విన్నర్ మారుతి కార్ కూడా దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
టైటిల్ ఎవరికి: ఇక విన్నర్ విషయానికి వస్తే నిఖిల్, గౌతమ్ ఇద్దరూ కూడా టైటిల్ రేస్‌లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇవ్వనున్నారు? అనే ఉత్కంఠ అభిమానులలో కూడా నెలకొంది. ఎందుకంటే గత సీజన్లలో విన్నర్ ఎవరో మూడు వారాల ముందే తెలిసేది. కానీ ఈ సీజన్ మాత్రం మరింత టఫ్‌గా మారింది. దీంతో అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ కూడా విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఈ ఇద్దరిలో ఒకరు టైటిల్ విజేతగా నిలవబోతున్నారు. ఈ విషయం అఫీషియల్‌గా మరికొన్ని గంటల్లో తెలియనుంది.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే - స్టేజ్ మీద సందడి చేయనున్న సెలబ్రిటీలు వీరే!- లేటెస్ట్ ప్రోమో చూశారా?
బిగ్‌బాస్ 8: ముగిసిన ఓటింగ్ - ఆ ఇద్దరి మధ్యనే టైటిల్ వార్!