Ind vs Aus 3rd Test 2024 : గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 405-7 స్కోర్‌తో పటిష్ఠ స్థితిలో ఉంది. క్రీజులో అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (7) ఉన్నారు. స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152 పరుగులు) భారీ శతకంతో మరోసారి సత్తాచాటగా, స్టీవ్ స్మిత్ (101 పరుగులు) సెంచరీతో రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
వర్షం కారణంగా తొలి రోజు 13 ఓవర్ల ఆట సాధ్యపడింది. దీంతో రెండో రోజు ఆరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభమైంది. 28-0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్, బుమ్రా, నితీశ్ దెబ్బకు 75 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ (9 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (21 పరుగులు)ను బుమ్రా ఔట్ చేశాడు. అనంతరం మార్నస్ లబుషేన్ (12 పరుగులు)ను యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ వెనక్కి పంపాడు.
Stumps on Day 2 in Brisbane!
— BCCI (@BCCI) December 15, 2024
Australia reach 405/7 in the 1st innings.
Jasprit Bumrah the pick of the bowlers for #TeamIndia so far with bowling figures of 5/72 👏👏
Scorecard - https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/500JiP8nsQ
అడ్డుగా నిలబడ్డారు
లబుషేన్ ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్‌లో స్మిత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత బౌలర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ ఈ జోడీ క్రీజులో చాలాసేపు పాతుకుపోయింది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 241 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ సెంచరీ మార్క్ దాటేశారు. టెస్టుల్లో హెడ్‌కు ఇది 9వ శతకం కాగా, భారత్‌పై మూడోది కావడం గమనార్హం. ఇక స్మిత్ దాదాపు 25 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం బాదాడు. టెస్టుల్లో అతడికి ఇది 33వ సెంచరీ.
బ్రేక్ ఇచ్చిన బుమ్రా
సెంచరీలతో మరింత ప్రమాదకరంగా మారిన హెడ్, స్మిత్‌ను యార్కర్ కింగ్ బుమ్రా విడదీశాడు. స్వల్ప వ్యవధిలో స్మిత్, మిచెల్ మార్ష్ (5 పరుగులు), ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు చేర్చి, భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. దీంతో రెండో రోజు ఆఖర్లో టీమ్ఇండియా మళ్లీ రేస్‌లోకి వచ్చింది. ఇక మిగిలిన మూడు వికెట్లను మూడో రోజు తొలి సెషన్లోనే పడగొట్టి, భారీ స్కోర్ నమోదు చేస్తేనే భారత్ గేమ్‌లో ఉంటుంది.
It's clearly,
— Richard Kettleborough (@RichKettle07) December 15, 2024
Jasprit Bumrah vs Australia 🇦🇺
Travis Head vs India 🇮🇳 #INDvsAUSpic.twitter.com/w6MbU08Rep
గబ్బాలో పంత్ నయా రికార్డు - 150 మార్క్‌ను తాకిన మూడో భారత వికెట్ కీపర్‌గా!
గబ్బా టెస్ట్‌లో సిరాజ్‌కు చేదు అనుభవం - గావస్కర్ ఫుల్ ఫైర్!