ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: ఏడో వారం నాగ మణికంఠ అవుట్​ - ఉండలేనంటూ సెల్ఫ్​ ఎలిమినేషన్​ - రెమ్యునరేషన్​ వివరాలివే! - BB8 NAGA MANIKANTA ELIMINATION

- సెల్ఫ్​ ఎవిక్షన్​ చేసుకుని హౌజ్​ నుంచి బయటకు - అందరికన్నా తక్కువ రెమ్యునరేషన్​ ఇతనిదేనట!

Naga Manikanta Elimination and Remuneration
Naga Manikanta Elimination and Remuneration (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 10:27 AM IST

Naga Manikanta Elimination and Remuneration : "గెలిచి తీరాలి అప్పుడే నా భార్య, నా కూతురు నాకు దక్కుతారు. నా అత్తమామల దగ్గర గౌరవం దక్కుతుంది" అంటూ అంటూ బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్​ అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు నాగ మణికంఠ. అయితే అనూహ్యంగా అతను ఏడో వారం ఎలిమినేట్​​ అయ్యాడు. ప్రేక్షకులు ఓట్లు వేసి గెలిపించినా.. "నేను మాత్రం ఉండను.. నాగార్జున గారూ నన్ను ఎలిమినేట్​ చేయండి" అని వేడుకున్నాడు మణికంఠ. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా బయటికి పోవడానికే ఫిక్స్​ అయ్యాడు. దీంతో బిగ్​బాస్​లో తన ప్రయాణానికి వీడ్కోలు పలికాడు. ఇంతకీ ఎలిమినేషన్​లో ఏం జరిగింది? నాగ మణికంఠ రెమ్యూనరేషన్​ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ వారం నామినేషన్స్‌లో మణికంఠ, గౌతమ్‌లు చివరి వరకూ నిలిచారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్న మణికంఠ నిర్ణయంపై మళ్లీ ఆలోచించాలని ఓ అవకాశం ఇచ్చారు. "మనుషులు మూడు రకాలు.. కొందరు అసలు మొదలు పెట్టరు.. మరికొందరు ప్రారంభించి ఆపేస్తారు.. ఇంకొందరు తమ లక్ష్యం సాధించే వరకూ వదలరు" అంటూ అతడిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేసినా, మణికంఠ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అతడి కోరిక మేరకు బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి ఎలిమినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రేక్షకులు వేసిన ఓట్ల వివరాలను రివీల్‌ చేశారు. ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్‌ ఎలిమినేట్‌ కావాల్సి ఉండగా, మణికంఠ తనని తాను ఎలిమినేట్‌ (Manikanta Bigg Boss 8) చేయమని కోరడంతో అతడిని ఇంటి నుంచి బయటకు పంపారు. అది చూసి ఇంటి సభ్యులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. "తప్పు నిర్ణయం తీసుకున్నాడు’, ‘వాడు వెళ్లను ఇక్కడే ఉంటాను అని ఉంటే గౌతమ్‌ వెళ్లిపోయేవాడు" అంటూ మిగిలిన హౌజ్​మేట్స్​ మాట్లాడుకున్నారు.

అనంతరం వేదికపైకి వచ్చిన మణికంఠతో ఎందుకు సెల్ఫ్‌ ఎవిక్షన్‌ చేసుకున్నావు అని నాగార్జున అడిగారు. ‘‘"ఎనర్జీ తగ్గిపోయింది. ఏదో నన్ను నేను నెట్టుకొస్తున్నా. ఫన్‌ టాస్క్‌ వచ్చినప్పుడు ఆలోచిస్తున్నా. ఫిజికల్ టాస్క్‌కి వస్తే, చాలా ఒత్తిడికి లోనవుతున్నా. పీకలదాకా వచ్చేసింది. మునిగిపోయినట్లు అనిపించింది. ప్రస్తుతం చాలా రిలీఫ్‌గా ఉన్నా. నాకు ఓటు వేసిన వాళ్లందరికీ క్షమాపణ చెబుతున్నా. ఏదో రకంగా వాళ్లను ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా. నా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నా. లక్ష్మీ దేవి కంటే ఆరోగ్యం ముఖ్యం. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్‌ వేదిక మంచి అవకాశం ఇచ్చింది. ప్రేక్షకుల సహకారం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చా. కానీ, నా ఆరోగ్యం నాకు ముఖ్యం. నాకు పునర్జన్మనిచ్చారు" అని మణికంఠ అన్నాడు. ఇక వెళ్లేముందు హౌజ్​లో ఉన్న వాళ్లలో ఎవరిని బోట్ ఎక్కిస్తావు? ఎవరిని ముంచేస్తావు? అని నాగార్జున ఓ టాస్క్‌ ఇచ్చారు.

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా? - Bigg Boss 8 Telugu

బోట్​ ఎక్కింది వీరే:

నైని పావని: "ఎమోషనల్‌ పర్సన్‌. నాలో ఉన్న చాలా లక్షణాలు ఆమెలోనూ ఉన్నాయి. ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటుంది. తన భావాలను బాగా వ్యక్తం చేస్తుంది. స్ట్రాటజీలు బాగున్నాయి" అంటూ మణికంఠ అన్నాడు.

విష్ణు ప్రియ: "నీళ్లలాగా చాలా స్వచ్ఛమైనది. తనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంది" అని చెప్పాడు.

నబీల్‌: "ప్రతి ఇంట్లో ఉండే ఒక సగటు అబ్బాయిలా ఉంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి?ఎంత మాట్లాడాలి?ఎలా ఆడాలి? అన్న తెలివి ఉన్న అబ్బాయి" అని వివరించాడు.

మెహబూబ్‌: "చాలా సైలెంట్‌గా ఉన్నాడు. విజేతకు ఉండాల్సిన లక్షణాల్లో ఇదీ ఒకటి. హౌజ్​ను హ్యాండిల్‌ చేసే పద్ధతి బాగుంది. ఇంకా చాలా ఆట ఉంది" అని పేర్కొన్నాడు.

అవినాష్‌, రోహిణి, హరితేజ: "ఈ హౌజ్​కు కావాల్సిన ప్రథమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌. వీరిలో ఇన్‌బిల్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటేనే వీళ్ల పడవ ముందుకు వెళ్తుంది. లేకపోతే మునిగిపోతుంది" అంటూ కామెంట్స్​ చేశాడు.

మునిగింది వీళ్లే: టేస్టీ తేజ, నిఖిల్‌, పృథ్వీ, గౌతమ్‌, ప్రేరణలకు పలు సలహాలు సూచనలు ఇస్తూనే ముంచేసే లిస్ట్​లో పెట్టాడు.

నాగ మణికంఠ రెమ్యునరేషన్​ ఇదే!: ఈ సీజన్​లో ఇప్పటికే బిగ్​బాస్​ నుంచి ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్ల రెమ్యునరేషన్​ వివరాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. తాజాగా నాగ మణికంఠ కూడా ఏడు వారాలకు గానూ బాగానే తీసుకున్నట్లు టాక్​. వారానికి రూ.1.2 లక్షల లెక్కన ఏడు వారాలకుగానూ దాదాపు రూ.8.4లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయినవే.. అఫీషియల్​గా ఎంత అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇప్పటి వరకు ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్లలో తక్కువ రెమ్యునరేషన్​ నాగ మణికంఠదే అని టాక్.

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.