ETV Bharat / entertainment

బిగ్​బాస్​: 8వ వారం ఎలిమినేషన్​ - ఆ ఇద్దరిలో ఒకరు బ్యాగ్​ సర్దుకోవాల్సిందే! - BIGG BOSS 8 EIGHTH WEEK ELIMINATION

-నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు -డేంజర్​ జోన్​లో ఆ ఇద్దరు

Eighth Week Elimination
Bigg Boss 8 Telugu Eighth Week Elimination (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 5:46 PM IST

Bigg Boss 8 Telugu Eighth Week Elimination: మరికొద్దిగంటల్లో బిగ్‌బాస్ సీజన్​ 8లో ఎనిమిదో వారం ముగియనుంది. వీకెండ్ అంటే ఆటపాటలతో పాటు కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికే ఈ సీజన్​లో ఎనిమిది మంది ఎలిమినేట్​ కాగా.. ఈ వారం కూడా మరొకరు బయటికి వెళ్లనున్నారు. మరి ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఓటింగ్‌లో ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..

వారం రోజులు ఏం జరిగింది: సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు నామినేషన్లు జరగగా.. బుధవారం నుంచి బీబీ రాజ్యం అనే టాస్క్​ పెట్టాడు బిగ్​బాస్​. ఇందులో పలు రకాల గేమ్​లో నిర్వహించగా.. చివరకు ప్రేరణ, రోహిణి, నిఖిల్​, పృథ్వీ చీఫ్​ కంటెండర్లగా సెలక్ట్​ కాగా.. మరో ఇద్దరికి అవకాశం ఇచ్చాడు బిగ్​బాస్​. దీంతో ఓజీ క్లాన్​ నుంచి విష్ణుప్రియ, రాయల్​ క్లాన్స్​ నుంచి టేస్టీ తేజకు అవకాశం లభించింది. అయితే మెగా చీఫ్​ను ఎన్నుకునే బాధ్యతను మిగిలిన కంటెస్టెంట్లకే ఇచ్చాడు బిగ్​బాస్​. దీంతో తమకు నచ్చనివారిని తగిన కారణాలు చెప్పి.. తీసేయాలని సూచించాడు. ఇలా అందరూ అయిపోగా చివరకు మెగా చీఫ్​గా విష్ణుప్రియ బాధ్యతలు స్వీకరించింది.

నామినేషన్స్​లో ఉన్నది వీళ్లే: సీజన్​ 8లో ఎనిమిదో వారం జరిగిన నామినేషన్ల ప్రక్రియ కాస్త హీటింగ్​గానే జరిగింది. దీంతో ఈ వారం నామినేషన్స్​లోకి నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని పావని వచ్చారు. అయితే నామినేట్ అయిన సభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అంటూ మెగా చీఫ్ గౌతమ్‌కి ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో హరితేజను సేవ్ చేశాడు గౌతమ్. కాగా ఎనిమిదో వారానికి నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, నయని పావని ఫైనల్​ అయ్యారు.

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

ఓటింగ్​ ఎలా ఉంది: రెండు రోజుల పాటు నామినేషన్లు జరగడంతో మంగళవారం రాత్రి నుంచి ఓపెన్​ అయిన పోలింగ్​ శుక్రవారంతో ముగిసింది. ఇక సోషల్ మీడియాలో వైరల్​ అవుతోన్న అనధికారిక ఓటింగ్ పరిశీలిస్తే.. నిఖిల్ మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచి తన సత్తా చూపించాడు. నిఖిల్ తర్వాతి స్థానంలో ప్రేరణ ఉండటం విశేషం. ఇక మూడు, నాలుగు స్థానాల్లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఉన్నారు. ఇక చివరి రెండు స్థానాలు అంటే డేంజర్​ జోన్​లో మెహబూబ్​, నయని పావని ఉన్నారు.

ఎలిమినేట్​ అయ్యేది ఎవరు: చివరి రెండు స్థానాల్లో ఉన్న మెహబూబ్​, నయని పావనిల మధ్యనే ఎలిమినేషన్​ ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ వారం జరిగిన ఫిజికల్​ టాస్క్​లలో మెహబూబ్​ బాగానే ఆడాడు. ఓజీ క్లాన్స్​ సభ్యులకు టఫ్​ ఫైట్​ ఇచ్చాడు. ఇక నయని పావని విషయానికి వస్తే ఈ వారం ఒక్క టాస్క్​లో కూడా పాల్గొనలేదు. అయితే నిజానికి నయని పావని విషయంలో ఆడియన్స్​లో నెగిటివ్​ ఫీలింగ్​ ఉంది. వచ్చిన మూడు వారాల్లో ఒక్క గేమ్​ కూడా సరిగా ఆడలేదని.. కేవలం ముచ్చట్లు పెట్టడం తప్ప ఆట అస్సలు ఆడట్లేదని ఫీల్​ అవుతున్నారు. అంతేగాక వైల్డ్​కార్డ్​ ఎంట్రీ తర్వాత నామినేషన్లలోకి రావడం ఇదే మొదటి సారి. దీంతో ఫ్యాన్​ బేస్​ లేక కూడా లీస్ట్​లో ఉన్నట్లు టాక్​. ఇదే జరిగితే ఈ వారం నయని బ్యాగ్​ సర్దుకోవాల్సిందే. ఇక ఈ విషయం అఫీషియల్​గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే..

బిగ్​బాస్​ 8: ఆరో వారం కిర్రాక్​ సీత అవుట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.