ETV Bharat / entertainment

బిగ్​బాస్​​ 8: ఆరో వారం షాకింగ్​ ఎలిమినేషన్​ - టాప్​లో ఉంటారనుకున్న​ కంటెస్టెంట్​ మధ్యలోనే ఇంటికి! - BIGG BOSS 8 SIXTH WEEK ELIMINATION

-వైల్డ్​ కార్డ్స్​ కంటెస్టెంట్లు వచ్చిన​ తర్వాత ఫస్ట్​ ఎలిమినేషన్​ -అనధికారిక ఓటింగ్​లో ఆమె టాప్

Bigg Boss 8 Sixth Week Elimination
Bigg Boss 8 Sixth Week Elimination (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 5:28 PM IST

Bigg Boss 8 Sixth Week Elimination: బిగ్​బాస్​ సీజన్​ 8 ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. గత వారం వైల్డ్​ కార్డ్స్​ ఎంట్రీతో ఆట స్వరూపమే మారిపోయింది. అటు ఆటతో.. ఇటు ఎంటర్​టైన్​మెంట్​తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఈ వారం ఏకంగా వైల్డ్​ కార్డ్​ కంటెస్టెంట్​ మెహబూబ్​ మెగా చీఫ్​గా కూడా ఎన్నికయ్యాడు. ఇక రాయల్​ క్లాన్స్​ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి ఎలిమినేషన్ కావడంతో ఆరో వారంలో ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్తారని ఆడియన్స్​లో కాస్త క్యూరియాసిటీ ఉంది. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..​

వైల్డ్ కార్డ్​ సభ్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి నామినేషన్లు కావడంతో కేవలం రాయల్​ క్లాన్​ సభ్యులు మాత్రమే ఓజీ క్లాన్​ సభ్యులో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్​ చేశారు. ఇక నామినేషన్ల విషయంలో రాయల్​ క్లాన్​ వర్సెస్​ ఓజీ క్లాన్​ కంటెస్టెంట్ల మధ్యలో కొన్ని విషయాల్లో వాగ్వాదాలు జరిగాయి. ఇక మొత్తానికి ఆరో వారం నామినేషన్లలో యష్మీ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ ఉండగా.. వైల్డ్​ కార్డ్స్​గా వచ్చిన మెహబూబ్, గంగవ్వ కూడా నామినేట్​ అయ్యారు.

బిగ్​బాస్​​ 8: వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్​ బాబు - అవినాష్​ ఆ మాట అనడంతోనే!

టాప్​లో ఎవరు: అయితే ఈ వారం నామినేషన్ల ప్రక్రియ రెండు రోజుల పాటు జరిగింది. దీంతో ఓటింగ్​ ప్రాసెస్​ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యి శుక్రవారం రాత్రి ఎండ్​ అయ్యింది. ఇక అన్అఫీషియల్​ లెక్కలు చూస్తే సీజన్​ 4 మాజీ కంటెస్టెంట్​, ప్రస్తుత సీజన్​లో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ టాప్​లో ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాతి స్థానంలో ప్రస్తుత మెగా చీఫ్​ మెహబూబ్​ ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా వెళ్లిపోయిన తర్వాత నెగిటివీటి పెంచుకుంటున్న యష్మీ.. ఈ వారం ఆటలో అదరగొట్టి మూడో స్థానంలో ఉందని టాక్​.

ఇక నాలుగో స్థానంలో.. విన్నర్​ కంటెస్టెంట్​ అనుకున్న విష్ణుప్రియ ఉన్నట్లు సమచారం. పృథ్వీ మీద పెట్టిన కాన్సట్రేషన్​ గేమ్​ మీద పెట్టనందుకు ఆమె లీస్ట్​లో ఉందని టాక్​. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పృథ్వీ, కిర్రాక్​ సీత ఉన్నారని తెలుస్తోంది. చీఫ్​ పోస్ట్​ పోయిన తర్వాత సీత ఆట మారినట్లు ప్రేక్షకులు ఫీల్​ అవుతున్నారు. దీంతో ఆమెకు ఓటింగ్​ తక్కువొచ్చినట్లు టాక్​.

ఎలిమినేట్​ అయ్యేది ఎవరు: గంగవ్వ, మెహబూబ్​, యష్మీ.. ప్రస్తుతానికి సేఫ్​ జోన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విష్ణుప్రియ, పృథ్వీ, సీత డేంజర్​ జోన్​లో ఉన్నారట. అయితే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ప్రకారం శనివారం ఎపిసోడ్​లో పృథ్వీ సేవ్​ అయ్యాడని.. విష్ణుప్రియ, సీత లీస్ట్​లో ఉన్నారని టాక్​. ఈ లెక్కన చూసుకుంటే సీత ఎలిమినేట్​ కావడం పక్కా అని సమాచారం. ఇక ఈ విషయం అఫీషియల్​గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే. అయితే సీత ఎలిమినేషన్​ ఓ రకంగా ఆడియన్స్​కు షాక్​ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రెండు వారాల్లో అదరగొట్టి చీఫ్ అయిన సీత.. ఆ తర్వాత వారాల్లో చాలా డల్​ అయ్యింది.

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.