Bigg Boss 8 Seventh Week Nominations: బిగ్‌బాస్ హౌజ్‌లో కిక్కిచ్చే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ప్రోమోల్లో కంటెస్టెంట్ల మధ్య హీటింగ్ డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా రోహిణి, అవినాష్, గౌతమ్ మధ్య యుద్ధమే నడిచింది. ఈ క్రమంలోనే "కామెడీ అంటే అంత లోకువా.. కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు కూడా తీసుకోకు.. షోకి రాకు" అంటూ అవినాష్ గట్టిగానే మాట్లాడాడు. అంతేకాకుండా గౌతమ్ కాళ్ల మీద పడి సారీ చెప్పాడు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియకి సరికొత్త థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. "ప్రశాంతంగా సాగే ప్రయాణంలో ఇంటి సభ్యులందరిలో నుంచి ఎవరు నామినేట్ అవుతారనేది కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ-ప్రేరణపైన ఆధారపడి ఉంటుంది.. ప్రతిసారి గుర్రం సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్‌ను పట్టుకోవాల్సి ఉంటుంది" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే హ్యాట్‌ను ఎవరైతే పట్టుకుంటారో వారి దగ్గర నామినేట్ చేసే పవర్ ఉంటుందన్నమాట.
ఇక ప్రోమోలో ముందుగా రోహిణి, నిఖిల్ తమ నామినేషన్స్ చెప్పేందుకు ముందుకు వచ్చారు. రోహిణి.. గౌతమ్‌ను నామినేట్ చేసింది. "చక్కగా ఫ్లోలో ఫన్ టాస్కు వెళ్తుంటే తన ఎమోషన్స్ హర్ట్ అయ్యాయి ఓకే.. కానీ ఆ కోపాన్ని మైక్ మీద చూపించడం నాకు నచ్చలేదు.. ఇది ఫస్ట్ పాయింట్" అంటూ రోహిణి చెప్పింది. ఇక దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకుంటూ.. "కామెడీ అయినా, ఏదైనా నాపైన చేస్తే అది బుల్లీయింగ్ (రెచ్చగొట్టడం) కిందకే వస్తుంది" అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి "అది చాలా పెద్ద పదం గౌతమ్.. అయినా ఫన్ టాస్కులో వాడు ఒక మాట ఎవరూ ఫీల్ కావద్దని చెప్పే కామెడీ చేశాడు" అంటూ నిఖిల్ అన్నాడు.
దీంతో గౌతమ్ మళ్లీ రెచ్చిపోయి.. "బుల్లీయింగ్ అంటే ఒక మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెప్పడమే" అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి "నాకు తెలీదు, తెలీదు, తెలీదు" అని అవినాష్ చెప్పగా, "నీకు నచ్చలేదని ఎవరికి తెలుసు" అంటూ రోహిణి ప్రశ్నించింది." కావాలని చేయలేదు.. బుల్లీయింగ్ అని వేలు పెట్టి గెలకలేదు" అంటూ అవినాష్ అన్నాడు. కానీ గౌతమ్ అక్కడితో వదిలేకుండా ఇది "కామెడీ షో కాదు.. మనం ఉన్నది బిగ్‌బాస్‌లో" అంటూ ఇంకా రెచ్చగొట్టాడు. దీంతో "కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు కూడా తీసుకోకు.. షోకి రాకు.. కామెడీ అంటే ఏమనుకుంటున్నారు" అంటూ చొక్కా విప్పేసి కింద పడేశాడు అవినాష్.
అంతేకాకుండా" గౌతమ్‌ను అశ్వత్థామ 2.0 అనకండరా మీకు దండం పెడతా.. సారీ భయ్యా నాకు తెలీదు" అంటూ గౌతమ్ కాళ్ల మీద పడ్డాడు అవినాష్. మరోవైపు "ఆ పాయింట్ మర్చిపోదామంటే మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారంటూ" గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇక రెండో ప్రోమో కూడా రిలీజ్ చేశారు బిగ్‌బాస్ టీమ్. ఇందులో పృథ్వీ, ప్రేరణ మధ్య కూడా గట్టిగానే మాటల యుద్ధం జరిగింది. హోటల్ టాస్క్‌లో బాగా ఆడలేదని పృథ్వీని నామినేట్ చేయాలని గంగవ్వ చూస్తే ప్రేరణ కూడా పృథ్వీని నామినేట్ చేయడానికి ఒప్పుకుంటున్నా అన్నట్లు చెప్పంది. దీంతో ప్రేరణ, పృథ్వీ మధ్య కాస్తా గట్టిగానే ఫైట్ జరిగింది. ఇక ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం గౌతమ్, పృథ్వీ నామినేట్లు అయినట్లు చూపించారు. మరి ఆ రెండు ప్రోమోలపై మీరు ఓ లుక్కేయండి..
బిగ్‌బాస్ 8 : లవ్ మ్యాటర్ రివీల్ చేసిన నబీల్ - పార్ట్నర్ ఆమేనటగా!
మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?
బిగ్‌బాస్ 8: ఆరో వారం కిర్రాక్ సీత అవుట్ - రెమ్యునరేషన్ వివరాలు లీక్!