Bigg Boss 8 Gangavva Heart Attack: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? దీనిపై బిగ్‌బాస్ టీమ్ ఎలా స్పందించింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 60 ఏళ్ల వయసులోనూ బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. నటన గురించి ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆమె మాట్లాడే యాస అందరికీ బాగా నచ్చుతుంది. తెలంగాణ కట్టు, బొట్టుతో గంగవ్వ బుల్లితెరపై పండించే కామెడీ మామూలుగా ఉండదు. అందుకే ఆమె పాపులారిటీ మెచ్చి తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 4 లో కంటెస్టెంట్‌గా తీసుకున్నారు. అయితే ఆ సీజన్లో కొన్ని వారాలే ఉన్న గంగవ్వ అనారోగ్య కారణాల దృష్ట్యా బయటికి వచ్చింది. తాజాగా సీజన్8 లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ క్రమంలోనే గంగవ్వకు హార్ట్ ఎటాక్ వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించి బిగ్‌బాస్ నిర్వాహకులు వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..
అందరూ పడుకున్న సమయంలో గంగవ్వ లివింగ్ రూమ్‌లోని సోఫా మీద కూర్చోని పెద్ద పెద్దగా అరుస్తూ దయ్యం పట్టినట్లుగా ఊగిపోయింది. దీంతో కంటెస్టెంట్లు ఒక్కొక్కరు హడావిడిగా వచ్చి గంగవ్వను చూసి హడలెత్తిపోయారు. ఏమైందో అని తెగ టెన్షన్ పడిపోయారు. ముఖ్యంగా నయని పావని అయితే "స్టోర్ రూమ్ కెమెరా ప్లీజ్ రెస్పాండ్" అంటూ ఆందోళన చెందింది. దగ్గరకు వచ్చిన రోహిణిని సైతం భయపెట్టింది గంగవ్వ. ఇక చివరగా చిన్నగా బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు టేస్టీ తేజ, అవినాష్. ఇక అక్కడ ఉన్న లేడీ కంటెస్టెంట్లు ఎలా పడుకోవాలి అని భయపడ్డారు. తీరా సీన్ కట్ చేస్తే ఇది ప్రాంక్ అయినట్లు వీడియోలో చెప్పారు. అంతకుముందు టేస్టీ తేజ, అవినాష్ గార్డెన్ ఏరియాలో కూర్చోని" ఇంటి సభ్యుల మీద మేము ముగ్గురం ఘోస్ట్ ప్రాంక్ చేస్తున్నాం. ఇది నాకు, అవినాష్, గంగవ్వ ముగ్గురికి మాత్రమే తెలుసు" అంటూ టేస్టీ తేజ చెప్పాడు. అంతకుముందే ఘోస్ట్లాగా ఎలా నటించాలో గంగవ్వకు టేస్టీ తేజ వివరించాడు. అయితే ఈ విషయం తెలియని హౌజ్‌మేట్స్ మాత్రం తెగ భయపడిపోయారు. మరి ఆ తర్వాత అన్నా ఈ విషయం తెలిసిందా లేదా అనేది ఇంకా చూపించలేదు.
వాడీవేడిగా నామినేషన్ల ప్రక్రియ - విష్ణు వర్సెస్ ప్రేరణ - ఎనిమిదో వారం ఎంతమందంటే!
బిగ్‌బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ, పృథ్వీరాజ్ బ్రేకప్ - అర్ధరాత్రి ఏం జరిగింది?