ETV Bharat / entertainment

'సింగం అగైన్‌' మాకు చాలా అన్యాయం చేసింది - ఆ సపోర్ట్ లేకుంటే ఎంతో నష్టపోవాల్సి వచ్చేది'

'సింగం అగైన్‌' మాకు అన్యాయం చేసింది : 'భూల్‌ భులయ్యా 3' నిర్మాత ఆవేదన!

Bhushan Kumar About Singham Again
Bhushan Kumar About Singham Again (Associated Press, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 22 hours ago

Bhushan Kumar About Singham Again : ఈ ఏడాది దీపావళి కానుకగా అజయ్‌ దేవ్‌గణ్‌ 'సింగం అగైన్‌', కార్తిక్‌ ఆర్యన్‌ 'భూల్‌ భులయ్యా 3' విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. బాలీవుడ్​కు చెందిన ఈ టాప్ సినిమాలు నవంబర్‌ 1న థియేటర్లలోకి అడుగుపెట్టాయి. అయితే ఈ సినిమాల విడుదలకు ముందే రెండు చిత్రబృందాల మధ్య రిలీజ్ డేట్ విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తాజాగా టీసిరీస్​ నిర్మాత భూషణ్ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 'సింగం అగైన్‌' టీమ్‌ వారికి అన్యాయం చేసిందని వాపోయారు.

"భూల్‌ భులయ్యా 3'ను అనౌన్స్ చేసినప్పుడే మేము ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాం. అయితే 'సింగం అగైన్‌' టీమ్ మాత్రం ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ విడుదల తేదీని ప్రకటించింది. కానీ వారు మాకు ఈ విషయంలో చాలా అన్యాయం చేశారు. విడుదల తేదీ గురించే వారితో మేము మేము ఎన్నోసార్లు చర్చలు కూడా జరిపాం. అంతేకాకుండా థియేటర్లను సమానంగా పంచాలంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ను కూడా అభ్యర్థించాం. మా చిత్రం కూడా 'సింగం అగైన్‌' లాంటి పెద్ద సినిమా కాబట్టి సమన్యాయం చేయాలంటూ కోరాం. కానీ, థియేటర్ల కేటాయింపుల విషయంలో మాకు ఘోర అన్యాయం జరిగింది. వారికి మాత్రం ఎక్కువ కేటాయించారు. చివరికి మా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో హవా చూపించడం వల్ల మరికొన్ని థియేటర్లను పెంచారు. అంత పెద్ద సినిమాతో పోటీ పడిన మా చిత్రం రూ.36 కోట్లకు పైగా ఓపెనింగ్స్‌ సాధించింది. కానీ ఎన్నో వాదనల తర్వాతనే 'సింగం అగైన్‌' టీమ్‌ మా మూవీకి సపోర్ట్‌ చేసింది. మాకు తగినంత సపోర్ట్‌ లేకపోయినట్లైతే 'భూల్‌ భులయ్యా 3'ని ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చేది. దాని వల్ల మేము ఎంతో నష్టపోవాల్సి వచ్చేది" అంటూ భూషణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ - రోహిత్‌ శెట్టి కాంబోలో వచ్చిన చిత్రం 'సింగమ్‌ అగైన్‌'. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, కీలక పాత్రల్లో మెరిశారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం రూ.336 కోట్లు వసూలు చేసింది. ఇక కార్తిక్‌ ఆర్యన్‌, త్రిప్తి దిమ్రీ, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ కీలక పాత్రల్లో నటించిన 'భూల్‌ భులయ్యా 3' రూ. 340 కోట్లు సాధించింది.

ఆ హీరో ఎంట్రీ కోసం గ్రాండ్ అరేంజ్​మెంట్స్ - 1000 మంది డ్యాన్సర్లతో స్పెషల్ సాంగ్​! - 1000 Dancer For Song Shoot

10 రోజుల షూటింగ్​.. రూ.20 కోట్ల రెమ్యునరేషన్​.. ఈ యంగ్​ హీరోకి భారీ డిమాండ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.