ETV Bharat / entertainment

'సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు'- భారతీయుడు 2 రిలీజ్ ఎప్పుడంటే ? - Bharateeyudu 2 Release Date - BHARATEEYUDU 2 RELEASE DATE

Bharateeyudu 2 Release Date : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్​, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్​లో రూపొందిన 'భారతీయుడు -2' సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్​డేట్​ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇంతకీ అదేందంటే ?

Bharateeyudu 2 Release Date
Bharateeyudu 2 Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 7:14 PM IST

Updated : Apr 6, 2024, 7:50 PM IST

Bharateeyudu 2 Release Date : లోకనాయకుడు కమల్​ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 (భారతీయుడు 2). 1996లో సూపర్ హిట్ టాక్ అందుకున్న భారతీయుడు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కడం వల్ల ఈ సినిమా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అప్​డేట్​ షేర్ చేసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్‍లో విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది.

"సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు. సిద్ధంగా ఉండండి! జూన్‍లో తుఫాను సృష్టించేందుకు ఇండియన్ 2 సిద్ధమైంది. మీ క్యాలెండర్లలో మార్క్ చేసి పెట్టుకోండి" అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఓ స్పెషల్ పోస్టర్​ను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే డేట్ చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో డేట్​ చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో టీజర్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే - కమల్​ హాసన్​తో పాటు సిద్ధార్థ్​, రకుల్ ప్రీత్ సింగ్​, ఎస్​జే సూర్య, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, వివేక్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, జాకీర్ హుస్సేన్, బాబీ సింహా, దిల్లీ గణేశ్, పీయూశ్ మిశ్రా, నీడుముడి వేణు, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని త్వరలోనే మిగతా విషయాలు అనౌన్స్​ చేయనున్నారట. తిరుపతి, చెన్నై, జమ్మలమడుగు, విజయవాడ, తైవాన్ లాంటి ప్లేసుల్లో ఈ సినిమా షూటింగ్ జరింగింది. హాలీవుడ్​ నుంచి ఫేమస్ స్టంట్ టీమ్​ను కూడా మేకర్స్ ఈ సినిమా కోసం పిలిపించారు.

KGF ఫైట్​ మాస్టర్లతో కమల్ మూవీ - ఆయన​ కోసం డైరెక్షన్​లోకి ఎంట్రీ

'భారతీయుడు- 2' షూటింగ్ కంప్లీట్- శంకర్ నెక్ట్స్ టార్గెట్ 'గేమ్ ఛేంజర్'!

Last Updated : Apr 6, 2024, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.