Best Inspirational movies: సినిమాలలో చాలా రకాలు ఉంటాయి కొన్ని వినోదాన్ని అందిస్తే, మరికొన్ని థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఇంకొన్ని స్ఫూర్తిని అందిస్తాయి. వినోదం అయినా, థ్రిల్ ఉన్న మూవీస్ అయినా ఒకసారో, రెండుసార్లు చూడచ్చు తర్వాత బోర్ కొట్టేస్తాయి. కానీ స్ఫూర్తినిచ్చే చిత్రాలు మాత్రం చూసేకొద్దీ అందులో మరిన్ని మంచి అంశాలు కనిపిస్తాయి. అలా హాలీవుడ్ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ఆ సినిమాలు ఏంటో చూసేద్దాం.
Whip it: 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. ఒక చిన్న ఊరులో ఉన్న టీనేజ్ అమ్మాయి తన తల్లితో ఇబ్బంది పడుతూ తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలనే తపనతో ఉంటుంది. అప్పుడు తనను కలిసిన కొందరు ఆడవాళ్లు ఆ అమ్మాయికి జీవితం మీద మరింత క్లారిటీ వచ్చేలా చేస్తారు. డ్రూ బ్యారీమోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఎలాయోట్ పేజ్ ప్రధాన పాత్రలో నటించింది. జీవన ప్రయాణంలో ముందుకు వెళ్లలేనప్పుడు మనల్ని ముందుకు నెట్టడానికి ఇలా ఎవరో ఒకరి సహాయం మనకు అవసరం అని ఈ సినిమా చెప్తుంది.
Perfect Days: 2023లో వచ్చిన ఈ మూవీ రొటీన్ జీవితాన్ని కూడా ఆస్వాదించడం ఎంత ముఖ్యమో చెప్తుంది. టోక్యోలో ఉండే ఒక పబ్లిక్ టాయ్ లెట్ క్లీనర్‌గా పనిచేస్తుంటాడు వ్యామ్ వెండర్స్. అందరి దృష్టిలో అతడి జీవితం బాధకరంగా గడుస్తూ, సమయం చాలా వృధా చేస్తున్నట్టు కనిపిస్తాడు. అయితే నిజానికి అతను తన రొటీన్ జీవితాన్ని తృప్తిగా గడుపుతూ ఉంటాడు. 'పర్ఫెక్ట్ అంటే ఏదో సాధించేసి ముందుకు దూసుకువెళ్లడమే మాత్రమే కాదు, ఒక్కోసారి మనకు తగిన పని చేస్తూ నెమ్మదిగా సమయాన్ని గడపడం కూడా' అనే కథాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం.
About time: ఈ మూవీ చూస్తే మన జీవితం గురించి మనం ఎంతో సంతోషిస్తాం. డామన్ హాల్ గ్లీసన్ జీవితంలో వచ్చే ట్విస్ట్స్, టర్న్స్ అతనికి అవి ముందే తెలిస్తే బాగుండేదని అతను బాధపడే తీరు మనకు బాధ కలిగిస్తుంది. ఈ చిత్రం ద్వారా మనకు జీవితం అంటే ఎంత విలువైనదో తెలుస్తుంది.
Ratatouille: జీవితంలో గెలవాలంటే మనిషే కావాలని లేదు, ఏ ప్రాణి అయినా తను అనుకున్నది సాధించచ్చు అని ఈ మూవీ నిరూపిస్తుంది. హోటల్లో ఆహారం ఉన్న చోట ఎలుకలు ఉండటం అనేది నిషేదం. కానీ అలాంటి చోట ఒక ఎలుక పెద్ద చెఫ్‌గా ఎలా మారింది అనేది ఈ సినిమా కథాంశం.
Before Sunset: ఏతేన్, జూలీ వియన్నాలో కలిసినప్పుడు ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో విడిపోయి మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత కలుస్తారు. అప్పటికే ఇద్దరికీ వేరేవాళ్లతో పెళ్లి జరిగిపోయి ఉంటుంది. అయితే మళ్లీ కలుసుకున్నాక ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఇంకా ప్రేమ తగ్గలేదని అర్థమవుతుంది.
Dead Poets Society: హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ నటించిన ఈ మూవీ ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ప్రాధాన్యత గురించి చెప్తుంది. రాబిన్ ఇందులో ఇంగ్లీష్ టీచర్ గా నటించాడు. ఇంగ్లీష్ టీచర్ గా తన విధ్యార్ధులను ఎలా తీర్చిదిద్దాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
Gone Girl: అన్నా హత్ వే ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మోసం చేసిన భర్తపై భార్య ఎలా పగ తీర్చుకుంది అనే కథాంశంతో తెరకెక్కింది. ఇందులో భర్తను ఇరకాటంలో పెట్టడానికి భార్య అదృశ్యమవడం అనేది ప్రేమలో మోసపోయిన వారు జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో నేర్పుతుంది.
Almost Famous: ఒక పదిహేనేళ్ల అమ్మాయి విల్లియమ్ మిల్లర్ జర్నలిస్ట్ కావాలని కలలు కంటూ ఉంటుంది. అసలు తను దేని గురించి రాయాలి అని తెలుసుకోవాలని రోడ్ ట్రిప్‌లో దేశం మొత్తం తిరుగుతూ ఉంటుంది.
Do the right thing: పోలీసుల చేతిలో చిక్కిన నల్ల జాతీయుల పోరాటం మీద తెరకెక్కిన చిత్రమిది. 1989లో వచ్చిన ఈ మూవీలో అప్పటి జాత్యహంకారం మీద జరిగిన పోరాటం గురించి చక్కగా చూపించారు.
Legally Blonde: 2001లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్నో అంశాలు జీవితం అంటే రకరకాల కోణాలు ఉంటాయి అని తెలియజేస్తుంది. మన చుట్టూ ఉన్నవారు మనం ఓడిపోవాలని కోరుకున్నప్పుడు వారి అంచనాలకు అందకుండా మనకు నచ్చినట్టు బ్రతకడమే జీవితం అని చెప్తుంది ఈ మూవీ.
రామ్‌చరణ్, అలియా భట్ కాదు- ఇండియాలో రిచెస్ట్ స్టార్ కిడ్ ఈ హీరోనే! - Richest star kid In India