ETV Bharat / entertainment

మరోసారి బాలయ్యతో కాజల్​ అగర్వాల్​! - NBK 109 Movie - NBK 109 MOVIE

Balakrishna NBK 109 Kajal Agarwal : బాలయ్య మరోసారి హీరోయిన్ కాజల్ అగర్వాల్​తో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

ETV Bharat
Balakrishna NBK 109 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 9:33 AM IST

Updated : May 8, 2024, 10:41 AM IST

Balakrishna NBK 109 Kajal Agarwal : నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ దగ్గరపడడంతో ఆ పనిలో బిజీగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా గ్యాప్ లేకుండా ప్రచార సభల్లో గడుపుతున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న ఆయన గతేడాది భగవంత్ కేసరితో భారీ మాసివ్ బ్లాక్ బస్టర్​ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో యంగ్ డైరెక్టర్ బాబీతో కలిసి ఎన్​బీకే 109 చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ నటుడు బాబీ దేఓల్ విలన్​గా నటిస్తున్నారు. తెలుగు భామ చాందిని చౌదరి, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా నటిస్తున్నట్టు మూవీటీమ్ ఇప్పటికే అఫీషియల్​గా అనౌన్స్ కూడా చేసింది. కానీ తనే హీరోయిన్ అని చెప్పలేదు. ఇతర హీరోయిన్ల పేరును కూడా అధికారికంగా ప్రకటించలేదు.

బయట నుంచి అందిన సమాచారం ప్రకారం రౌతేలా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలిసింది. అయితే తాజాగా హీరోయిన్​ ఎవరనేది కూడా ప్రచారం సాగుతోంది. ఆమె మరెవరో కాదు చందమామ కాజల్ అగర్వాల్. ఈమె ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మరో ప్రచారం కూడా సాగుతోంది. కాజల్​ చేసేది కాస్త నెగిటీవ్‌ షేడ్స్‌ ఉండే పాత్ర అని మరొకొందరు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వస్తే కానీ దీనిపై క్లారిటీ రాదు. మరో విశేషమేమిటంటే బాలయ్య నటించిన గత సినిమా భగవంత్ కేసరిలోనూ బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించి ఆకట్టుకుంది. తన కామెడీ​తో బాలయ్యతో కలిసి నవ్వించింది.

కాగా, ఎన్​బీకే 109 సినిమా విషయానికొస్తే బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌ వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోంది. పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ధోనీ మీద ప్రేమతో అలా' - బాహుబలి యానిమేటెడ్​ సిరీస్​పై జక్కన్న కామెంట్స్​​! - Rajamouli Baahubali

బాలయ్యను ఢీ కొట్టేందుకు సెట్​లోకి అడుగుపెట్టేసిన హంటర్​ - NBK 109 Villain

Last Updated : May 8, 2024, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.