ETV Bharat / entertainment

'అఖండ 2' టైటిల్ థీమ్ కూడా వచ్చేసింది - తమన్ తాండవం అదిరిపోయిందంతే! - BB4 AKHANDA 2 TITLE THEME

'అఖండ 2' టైటిల్ థీమ్​ను విడుదల చేసిన మూవీటీమ్​!

BB4 Akhanda 2
BB4 Akhanda 2 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 11:22 AM IST

BB4 Akhanda 2 Theme Music Thaman : నందమూరి నటసింహం బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను నేడు(అక్టోబర్ 16) వరుస సర్​ప్రైజ్​లు ఇస్తూ ఫ్యాన్స్​లో జోష్ నింపుతున్నారు. మొదట BB4ను అఖండ 2గా ప్రకటించిన మూవీ టీమ్ ఆ తర్వాత షూటింగ్​ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మూవీ టీమ్​తో పాటు బాలయ్య కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని సహా ఇతర కుటుం బసభ్యులు ఈ ఈవెంట్​లో సందడి చేశారు. మూవీ టీమ్​కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ముహూర్తపు షాట్‌కు బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇకపోతే సినిమాను గ్రాండ్​గా లాంఛ్​ చేసిన కాసేపటికే అఖండ 2 టైటిల్ థీమ్​ను కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోను వదిలారు మేకర్స్. ఈ టైటిల్ థీమ్​కు మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్​ టైటిల్​కే ఈ రేంజ్​లో ఇచ్చాడంటే సినిమాకు ఏ రేంజ్​లో ఇస్తాడో, పూనకాలే అంటూ అంచనాలు పెంచేసుకుంటున్నారు. పైగా ఇప్పుడు అఖండ 2 టైటిల్​కు తాండవం అనే క్యాప్షన్ ఇచ్చారు. దానికి తగ్గట్టు తమన్ తాండవం చూపించేలా ఉన్నాడే అని కూడా అంటున్నారు. మీరు కూడా అఖండ 2 టైటిల్ థీమ్ వినేయండి.

Balakrishna Boyapati Movie : బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ భారీ విజయాన్ని అందుకుంది. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్​గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే BGM ఇచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్స్​లో సౌండ్​ బాక్స్​లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇక చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. హీరోయిన్​గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది.

BB4గా 'అఖండ 2' అఫీషియల్ అనౌన్స్​మెంట్ - ఇక తాండవమే

ట్రెండింగ్​లో సమంత 'సిటాడెల్'​ - ఈ సిరీస్​ కోసం ఆమె ఎన్ని కోట్లు తీసుకుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.