ETV Bharat / entertainment

'అఖండ 2' కోసం క్రేజీ సీక్వెన్స్ - ఫస్ట్ సీన్​లోనే బాలయ్య సూపర్ ఫైట్! - BALAKRISHNA AKHANDA 2

'అఖండ 2'లో ఆ క్రేజీ సీక్వెన్స్! - ఓపెనింగ్ సీన్​లోనే బాలయ్య తాండవం!

Balakrishna Akhanda 2
Balakrishna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 10:02 AM IST

Balakrishna Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'అఖండ 2'. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్​గా లాంఛ్ అయ్యింది. ఈ నేపథ్యంలో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ సీక్వెల్ స్టార్టింగ్ సీక్వెన్స్ గురించి ఓ సూపర్​ అప్​డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కథ ఓపెనింగ్ సీన్​ను యూఎస్​లో ఓ యాక్షన్ సీక్వెన్స్​తో ఓపెన్ అవుతుందని, అందులో ప్రగ్యా జైస్వాల్ పాత్ర ట్రీట్మెంట్​ కోసం రెండో బాలయ్య పాత్ర యూఎస్ వెళ్లాల్సి వస్తుందని, అక్కడ తెలుగు వాళ్లపై దాడి జరిగే క్రమంలో బాలయ్య పాత్ర వారిని సేవ్ చేస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.'బాలయ్య యాక్షన్​కు ఇటువంటి ఎంట్రీ కావాల్సిందే' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'మాస్ ఎంట్రీ కోసం వెయిటింగ్' అని అంటున్నారు.

ఇక 'అఖండ 2' సినిమా విషయానికి వస్తే, బాలయ్య బోయపాటి కాంబోలో రానున్న 4వ సినిమా ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గ్రాండ్​గా లాంఛ్​ చేసిన కాసేపటికే 'అఖండ 2' టైటిల్ థీమ్​ను కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోను వదిలారు మేకర్స్. ఈ టైటిల్ థీమ్​కు మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్​ టైటిల్​కే ఈ రేంజ్​లో ఇచ్చారంటే సినిమాకు ఏ రేంజ్​లో ఇస్తారో, పూనకాలే అంటూ అంచనాలు పెంచేసుకుంటున్నారు. పైగా ఇప్పుడు 'అఖండ 2' టైటిల్​కు తాండవం అనే క్యాప్షన్ ఇచ్చారు. దానికి తగ్గట్టు తమన్ తాండవం చూపించేలా ఉన్నారే అని కూడా అంటున్నారు.

BB4గా 'అఖండ 2' అఫీషియల్ అనౌన్స్​మెంట్ - ఇక తాండవమే

'అఖండ 2' టైటిల్ థీమ్ కూడా వచ్చేసింది - తమన్ తాండవం అదిరిపోయిందంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.