Balakrishna 50 years : నందమూరి బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో 50 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న విడుదలైంది. అంటే యాభయ్యేళ్లుగా ఆయన తిరుగులేని ప్రయాణం చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా, వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యకు సుదీర్ఘంగా డైలాగ్‌లు చెప్పడంలో అందెవేసిన చేయి. కెరీర్‌లో వందకు పైగా చిత్రాలు, వందలాది పైగా వేషధారణలు, చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటుడిగా నిలిచారాయన. తన తరంలో డబల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఏకైక నటుడిగానూ రికార్డు సృష్టించారు!
మాస్ కథలతో పూనకాలు తెప్పించడం, క్లాస్ కథలతో మెప్పించడం బాలయ్యకే సాధ్యమైంది. మంగమ్మగారి మనవడుగా, నారీ నారీ నడుమ మురారిగా కెరీర్ ఆరంభంలో సాంఘిక చిత్రాలతో అదరగొట్టిన ఆయన ఆ తర్వాత తొడగొట్టి ఫ్యాక్షన్ కథలతో తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పారు. ఖడ్గం చేతపట్టి 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా రాజసాన్ని ప్రదర్శించారు. పౌరాణిక గాథలతో ఎన్టీఆర్ తర్వాత, ఆ కథలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. 'ఆదిత్య 369' లాంటి సైన్స్ ఫిక్షన్ కథలు, భైరవద్వీపం' తరహా జానపద చిత్రాలు - ఇలా ఎన్నో ప్రయోగాలు చేశారు. అందుకే ఆడియెన్స్‌కు బాలకృష్ణ సినిమాలంటే పచ్చి. అసలు అభిమానులకైతే ఓ పెద్ద సంబరం. వంద రోజులు కాదు, సిల్వర్ జూబ్లీలు కాదు, వెయ్యి రోజుల వరకు థియేటర్లలో ఆ సంబరాలు కొనసాగుతూ ఉంటాయి.
గుర్తుండిపోయే పాత్రల్లో - భైరవద్వీపం, శ్రీ కృష్ణార్జునవిజయం, మంగమ్మగారి మనవడు, ముద్దలమావయ్య, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు, నిప్పురవ్వ, బంగారుబుల్లోడు, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, బోబ్బిలి సింహం, పెద్దన్నయ్య, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, శ్రీ రామరాజ్యం, పాండురంగుడు, గౌతమిపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ బైయోపిక్(కథానాయకుడు, మహానాయకుడు), అఖండ, భగవంత్ కేసరి, వీరసింహరెడ్డి, లెజెండ్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు.
నవ యువకుడిలా - ప్రస్తుతం ఆరు పదుల వయసు వచ్చినా బాలయ్యలో జోష్ ఏమాత్రం తగ్గలేదు. నవ యువకుడిలా వెండి తెరపై చెలరేగిపోతున్నారు. ఆయన వేగానికి యువ దర్శకులు కూడా కథలతో క్యూ కట్టేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో 109వ చిత్రాన్ని చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. త్వరలోనే తన వారసుడు మోక్షజ్ఞను కూడా వెండి తెరకు పరిచయం చేయనున్నారు.
రాజకీయ వారసత్వాన్ని - తండ్రి నుంచి నట వారసత్వమే కాదు, రాజకీయ వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకున్నారు బాలకృష్ణ. ఓ వైపు సినిమా, మరోవైపు ప్రజా సేవపై కూడా దృష్టి పెడుతూ ప్రయాణం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకున్నారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా వేలాది మంది చిన్నారులుకు,పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందేలా తన వంతు సాయం అందిస్తున్న గొప్ప వ్యక్తిగా నిలిచారు. ఇలా సినీరంగంలో, రాజకీయ రంగంలో, సేవా రంగంలో ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న ఏకైక వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ.
అంగరంగా వైభవంగా - బాలయ్య నట ప్రయాణాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో అంగ రంగ వైభవంగా స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇతర భాషలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
5️⃣0️⃣ years back exactly on the same day a man started his film Journey as a son of the Legend and then to a Royal LEGEND of the TFI🔥
— manabalayya.com (@manabalayya) August 29, 2024
The Only actor in Indian Cinema who can portray the Roles with ease in all kinds of genres like Historical, Sci Fiction, Faction, Folklore,… pic.twitter.com/6ci2CBEklO
'రోజుకో 'NTR' సినిమా- కబడ్డీ టీమ్ కెప్టెన్'- బాలయ్య లైఫ్‌స్టైల్! - Balakrishna 50 Years