Alluarjun Wife Emotional : సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీ చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటీషిన్ విచారణ జరిపి బన్నీకి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేశారు. కానీ బెయిల్ కాపీ ఆలస్యం కావడం వల్ల, జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే 7 గంటలకు బన్నీని విడుదల చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Alluarjun Arrest : అయితే జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపారు. న్యాయవాది నిరంజన్‌రెడ్డితోనూ అల్లు అర్జున్ 45 నిమిషాలు చర్చించారు. అలా అక్కడ సుధీర్ఘ చర్చల తరువాత బన్నీ తన నివాసానికి వెళ్లారు. అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులతో పాటు మీడియా వచ్చింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడే ముందు తన కుటుంబాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు బన్నీ.
బన్నీని చూడంగానే పిల్లలు అర్హ, అయాన్ తెగ సంతోష పడ్డారు. పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని హత్తుకున్నారు. అయాన్‌ను ఎత్తుకుని బన్నీ ఎమోషనల్ అయ్యారు. అనంతరం స్నేహారెడ్డి కూడా తన భర్తను గట్టిగా హత్తుకుని కన్నీరు పెట్టుకుంది. బన్నీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 30 సెకన్ల పాటు ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను చూసి ఎమోషనల్ అవుతున్నారు.
ఇకపోతే ఇంట్లోకి అడుగు పెట్టే ముందే అల్లు అర్జున్‌కు దిష్టి తీశారు కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. మొత్తానికి బన్నీ ప్రస్తుతం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అల్లు ఫ్యామిలీ వారు మాత్రమే అక్కడే కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులెవ్వరూ కూడా అక్కడా కనిపించలేదు. కాసేపట్లో వారు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది!
Video of the day ❤️❤️#AlluArjun
— S (@UrsShareef) December 14, 2024
pic.twitter.com/3scpgMDEma
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత 'పుష్ప 2' కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
'ఇది మనందరి తప్పు' - అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన హీరో నాని