ETV Bharat / entertainment

అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్​ ఎవరంటే? - Atlee Allu Arjun Movie - ATLEE ALLU ARJUN MOVIE

Atlee Allu Arjun Movie heroine : అల్లు అర్డున్​తో చేయబోయే సినిమాలో హీరోయిన్​ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో దర్శకుడు అట్లీ ఉన్నారని సమాచారం అందింది. హీరోయిన్​గా త్రిష లేదా సమంత నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో వెళ్లి తెలుసుకుందాం.

అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్​ ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 6:44 AM IST

Atlee Allu Arjun Movie heroine : పుష్ప చిత్రంతో ఇండియావైడ్​గా క్రేజ్​ సంపాదించుకుని సెల్ఫ్​ మేడ్ పాన్​ ఇండియా హీరో అయ్యారు అల్లు అర్జున్​. ఈ చిత్రంతోనే ఐకాన్ స్టార్​గానూ మారారు. ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న పుష్ప 2 చిత్రం చేస్తున్నారు. అయితే పుష్ప వల్ల వచ్చిన క్రేజ్​తో తన తదుపరి సినిమాల లైనప్​ గురించి ఆచితూచి మరీ అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్​. అందుకే బడా దర్శకులందరితో చర్చలు జరిపి చాలా కాలమైనప్పటికీ ఒకే ఒక్క సినిమాను అనౌన్స్ చేశారు. అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో.

ఇది ఎప్పుడు సెట్స్​పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. కానీ పుష్ప 2 తర్వాత సెట్స్​పైకి వెళ్లేది ఇది కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్​ అట్లీతో బన్నీ మూవీ ఉంటుందని చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. అఫీషియల్​గా దీనిని ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. ఇందులో భాగంగానే హీరోయిన్​ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో అట్లీ పడ్డారని సమాచారం అందింది.

ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్​గా త్రిష నటించే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి ఫామ్​లో ఉంది. ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదే సమంత. గతంలో అట్లీ దర్శకత్వం వహించిన తేరీ చిత్రంలో విజయ్ దళపతి పక్కన హీరోయిన్​గా నటించారు సమంత. అలాగే సన్నాఫ్ సత్యమూర్తిలో హీరోయిన్​గా, పుష్పలో ఉ అంటావా మావ సాంగ్​లో బన్నీతో కలిసి సందడి చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటిస్తారని బయట టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి బన్నీ సరసన నటించేది త్రిషనా? లేదా సమంతనా? తెలియాలంటే అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ అక్టోబర్‌లో అల్లు అర్జున్‌ – అట్లీ చిత్రం సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఈ వారమే విజయ్ ఫ్యామిలీ స్టార్, ​మంజుమ్మల్‌ బాయ్స్‌ - ఓటీటీలోకి మరో 15 సినిమాలు! - This Week Release Movies

రష్మిక వీకెండ్ ప్లాన్​ - దాదాపుగా ఇదే చేస్తుందట! - Rashmika Weekend Plan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.