Arijit Singh Birthday Special : అర్జిత్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన గాత్రంతో అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తారు ఈ స్టార్ సింగర్. ఆనందం, విషాదం ఇలా ఎమోషనల్ ఎటువంటిదైనా వాటిని అర్జిత్ మార్క్ పడితే సూపర్ హిట్ కావాల్సిందే. యువతలో అతని పాటలకు మంచి క్రేజ్ ఉంది.
ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు అర్జిత్. తన ఇన్స్పిరేషనల్ జర్నీతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్ సింగర్ ఓ మ్యూజిక్ పోడ్కాస్ట్లో తన సింగింగ్ జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పగలు రాత్రులు తన గొంతు బాలీవుడ్ టాప్ హీరోల వాయిస్‌కు సరిపోయేలా మార్చుకోవడానికి ప్రాక్టీస్ చేసేవాడినంటూ చెప్పారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ వాయిస్‌కు సరిపోయేలా ఉండేందుకు గొంతు అరిగిపోయేలా ప్రాక్టీస్ చేసేవాడినని అన్నారు.
"ఇది ఎప్పుడూ వాయిస్ గురించి కాదు, ఇది కేవలం గాత్రం గురించి. నా వాయిస్‌లో మార్పులు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నా వాయిస్ షారుక్ ఖాన్‌తో సరిపోలినట్లు ఉండేది కాదు. అందుకే గొంతు అరిగిపోయేలా ప్రాక్టీస్ చేశాను. మరుసటి రోజు ఉదయమే నాకు సెట్ అయ్యేది." అంటూ అర్జిత్ చెప్పుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక అర్జిత్ కెరీర్ విషయానికి వస్తే, బంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్‌లో 1987లో జన్మించారు అర్జిత్. సింగింగ్‌పై ఆయన మక్కువను గమనించిన తల్లిదండ్రులు అర్జిత్‌కు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. 2005 లో ఓ బాలీవుడ్ సింగింగ్ రియాల్టీ షో లో పాల్గొన్నారు. కానీ ఈ షోలో ఆయన చివరి వరకు వెళ్లలేకపోయారు. అయితే ఆయన పట్టు వదలకుండా శ్రమించారు. 2010లో వచ్చిన 'తోసే నైనా' మ్యూజిక్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయన సక్సెస్ అందుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
2011లో 'మర్డర్ 2'లో ఓ మెస్మరైజింగ్ సాంగ్ పాడి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. అనతికాలంలోనే టాప్ సింగర్స్‌లో ఒక్కరిగా ఎదిగారు. అర్జిత్ ఇప్పటివరకు తెలుగు, హిందీలో మొత్తం 655కు పైగా పాటలు పాడాడు. ఆయన మరాఠీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ, అస్సామీ, గుజరాతీలో కూడా పాటలు పాడారు. ఇటీవలే 'ఓం బీమ్ బుష్' సినిమాలో అనువనువు అనే పాటతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Arjit Singh Injury : సింగర్‌ను గాయపరిచిన మహిళా అభిమాని.. షేక్ హ్యాండ్ ఇస్తూ..