ETV Bharat / entertainment

భయపెడుతున్న తెలుగు హీరోయిన్​ హారర్ థ్రిల్లర్​ మూవీ! - రిలీజ్ ఎప్పుడంటే? - Ananya Nagalla Tantra movie

Ananya Nagalla Tantra movie Release Date : అచ్చ తెలుగుమ్మాయి అనన్య నాగళ్ల నటించిన హారర్ థ్లిల్లర్​ మూవీ రిలీజ్​కు రెడీ అయింది. ఆ రోజే థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టనుంది! దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

భయపెట్టేందుకు సిద్ధమైన అచ్చ తెలుగు హీరోయిన్​ హారర్ మూవీ - రిలీజ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 6:39 AM IST

Ananya Nagalla Tantra movie Release Date : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి చాలా మంది ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. అచ్చ తెలుగుమ్మాయైన ఈ బ్యూటీ నటన మీద ఉన్న ఆసక్తితో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. అలా షార్ట్ ఫిల్మ్‌తోనే మస్త్​ పాపులర్ అయిన అనన్య 'మల్లేశం' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులోనూ నేచురల్ యాక్టింగ్​తో ప్రశంసలు అందుకున్న ఈ భామ ఆ తర్వాత 'ప్లే బ్యాక్' చిత్రంతో పాటు పవన్ కల్యాణ్​ 'వకీల్ సాబ్'లో దివ్య నాయక్ అనే పాత్రను పోషించి ఆకట్టుకుంది.

దీంతో అనన్యకు హీరోయిన్​గా తెలుగులో మంచి ఆఫర్స్​ వస్తాయని అంతా ఆశించారు. కానీ ఈ లోకల్​ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. హీరోయిన్​గా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే 'మాస్ట్రో', 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం' , 'మళ్లీ పెళ్లి', 'బూట్ కట్ బాలరాజు' ఇలా పలు సినిమాలు చేసినా అంతగా ఫేమ్ రాలేదు.

ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్​ చేసిన ఈమె ఇప్పుడు తాజాగా ఓ హారర్ చిత్రంతో భయపెట్టేందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర అనే సినిమాతో ఆడియెన్స్​ను అలరించనుంది. మూవీలో భయపెట్టే అమ్మాయిగా సరికొత్తగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకుంది. ఈ క్రతువుకు తప్పకుండా రావాలి. మార్చి 15న సినిమా థియేటర్లలోకి రానుంది అంటూ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది అనన్య. ఓ పోస్టర్​ను కూడా విడుదల చేసింది.

ఇక ఈ చిత్రంతో దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుశ్​ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్​ సినిమాపై ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేశాయి. ’కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే అందులో ఊహకందని రహస్యాలు ఎన్నో అంటూ మూవీపై ఆసక్తిని పెంచారు మేకర్స్​. మరో నటి సలోని ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. చిత్రాన్ని బి ద వే ఫిల్మ్స్, ఫస్ట్ కాపీ మూవీస్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నరేశ్​ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టాలీవుడ్ స్టార్లకూ రిలీజ్ డేట్ సెంటిమెంట్- 10 మంది హీరోల సినిమాలు ఒకే తేదీనే

కేవలం రూ. 2 కోట్ల కలెక్షన్స్ - ఆ ఒక్క సినిమాతో రజనీ బీటౌన్ కెరీర్ డౌన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.