ETV Bharat / entertainment

​అభిషేక్​, ఐష్ డివోర్స్ రూమర్స్! - బ్లాగ్​లో వారిపై అసహనం వ్యక్తం చేసిన అమితాబ్​ - AMITABH BACHCHAN ON DIVORCE RUMORS

ఆధారాలు లేకుండా వార్తలు రాస్తుంటారు - ఇతరులు వాటిని నమ్మేలా చేస్తుంటారు : అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan On Divorce Rumors
Amitabh Bachchan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 5:43 PM IST

Amitabh Bachchan On Divorce Rumors : బాలీవుడ్ స్టార్ కపుల్​ అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్​చల్​ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కథనాలపై బిగ్​బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. తన కుటుంబం గురించి వస్తోన్న వార్తలను ఉద్దేశించి గురువారం ఆయన తన బ్లాగ్‌లో ఓ పోస్ట్​ వేసి అసహనం వ్యక్తం చేశారు. అవన్నీ అసత్య ప్రచారాలు మాత్రమేనంటూ అందులో పేర్కొన్నారు.

"విభిన్నంగా ఉండటానికి, జీవితంలో దాని ఉనికిని విశ్వసించడానికి అపారమైన ధైర్యం, చిత్తశుద్ధి ఎంతో అవసరం. నా ఫ్యామిలీ గురించి నేను చాలా అరుదుగా మాట్లాడుతుంటాను. ఎందుకంటే అది నా సామ్రాజ్యం. దాని ప్రైవసీ కాపాడాల్సిన బాధ్యత నాపై ఎంతో ఉంది. ఇక అసత్య ప్రచారాలు అంటారా అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు కొందరు. కానీ మనం దేని గురించైనా చెప్పాలనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే నిజమైన వృత్తి ధర్మం. కానీ తమ వార్తలతో అందరి దృష్టిని ఆకర్షించడం కోసం చేసే ఇటువంటి పనులను నేను సవాలు చేయాలని అనుకోవడం లేదు. సమాజం కోసం వారు చేస్తోన్న సేవలను నేను ఎంతగానో ప్రశంసిస్తాను. అయితే చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారు ప్రశ్నాసూచకంతో సమాచారం ఇచ్చి ఇతరులు నమ్మేలా చేస్తుంటారు" అని అమితాబ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, ఇటువంటి అవాస్తవ ప్రచారాల వల్ల తాను ఎంతగానో బాధపడినట్లు ఆయన ఆ బ్లాగ్​లో రాసుకొచ్చారు. విషయం ఏదైనా సరే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ఇస్తే బాగుంటుందని అమితాబ్​ అభిప్రాయపడ్డారు.

ఇక 2007లో అభిషేక్‌ - ఐశ్వర్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ జంట పలు ఈవెంట్స్‌కు కలిసి హాజరు కాకపోవడం, అలాగే సోషల్ మీడియాలోనూ విభిన్నమైన పోస్ట్​లు పెట్టడం వల్ల వీరి విడాకుల రూమర్స్ జోరుగా సాగాయి. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలోనూ అమితాబ్‌ కుటుంబం, ఐశ్వర్య రాయ్‌ విడిగా ఫొటోలు దిగారు. అలాగే తాజాగా ఆరాధ్య పుట్టిన రోజు వేడుకల్లోనూ అభిషేక్‌ కనిపించలేదు. దీంతో ఈ ప్రచారం కాస్త మరింత ఎక్కువ్వడం గమనార్హం.

విశ్వ సుందరి ఐష్​ గురించి ఈ విషయాలు తెలుసా?

'మేం వచ్చేస్తున్నాం, మా నాన్నను ఆపడం కుదరదు'- ఐశ్వర్య ఫ్యామిలీకి అభిషేక్ షాకింగ్ సర్​ప్రైజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.