ETV Bharat / entertainment

ఆసక్తిరమైన స్టోరీలైన్​తో సుహాస్​ కొత్త సినిమా - 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఎలా ఉందంటే ?

Ambajipeta Marriage Band Review : యంగ్ హీరో సుహాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Ambajipeta Marriage Band Review
Ambajipeta Marriage Band Review
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 9:19 AM IST

Updated : Feb 2, 2024, 10:08 AM IST

Ambajipeta Marriage Band Review : 'క‌ల‌ర్‌ఫొటో', 'రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యంగ్​ హీరో సుహాస్​. ఇటీవ‌లే ఆయ‌న లీడ్​ రోల్​లో వచ్చిన మ‌రో చిత్రమే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. తాజాగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందంటే ?

స్టోరీ ఏంటంటే :
అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మ‌ల్లి (సుహాస్‌) ఓ మెంబర్​. చిర‌త‌ పల్లిలో త‌న ఫ్యామిలీతో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) అదే ఊరి స్కూల్​లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. అయితే ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందంటూ, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ రూమర్​ మొద‌ల‌వుతుంది. ఇంత‌లో వెంక‌ట్‌బాబు చెల్లెలు ల‌క్ష్మి (శివాని నాగారం), మ‌ల్లి ప్రేమ‌లో ప‌డ‌తారు. వెంక‌ట్‌బాబు త‌మ్ముడికీ, మ‌ల్లికీ మ‌ధ్య ఊళ్లో గొడ‌వ, ఆ త‌ర్వాత స్కూల్ విష‌యంలో ప‌ద్మ‌కీ, వెంక‌ట్‌బాబుకీ మ‌ధ్య వాగ్వాదం మొద‌ల‌వుతుంది. అవి కాస్త పెద్దదిగా మారుతుంది. ఇంత‌లో మ‌ల్లి, ల‌క్ష్మిల లవ్​ స్టోరీ కూడా బ‌య‌ట ప‌డుతుంది. అయితే ఎలాగైనా ఆ ఫ్యామిలీపై రివెంజ్​ తీర్చుకోవాల‌ని ఓ రోజు వెంక‌ట్‌ బాబు రాత్రివేళ‌లో ప‌ద్మని స్కూల్‌కి పిలిపించి అవ‌మానిస్తాడు. ఆ త‌ర్వాత ఏం జరిగింది? మ‌ల్లి, ల‌క్ష్మిల లవ్​ స్టోరీలో
ఎటువంటి ట్విస్ట్​ ఏర్పడిందో తెరపై చూడాల్సిందే

ఎలా ఉందంటే :
స‌మాజంలోని అంత‌రాలు, ప‌రువు, ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమాలు ఈ మ‌ధ్య త‌ర‌చూ రూపొందుతున్నాయి. త‌మిళంలో అయితే వీటి ప్ర‌భావం చాలా గ‌ట్టిగా ఉంది. తెలుగు డైరెక్టర్లు ఈ మ‌ధ్య మ‌న మూలాల్లోకి వెళ్లి అలాంటి స్టోరీలను తెరకెక్కించాలనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విజ‌యాలను అందుకుంటున్నారు. ఆ త‌ర‌హా మరో ప్ర‌య‌త్న‌మే ఇది. ఓ అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య ప్రేమే ఈ క‌థ‌కి ముఖ్య‌మైతే ఇదొక సాధార‌ణ‌మై ప్ర‌య‌త్న‌మే అయ్యుండేది. కానీ డైరెక్టర్​ తెలివిగా ప్రేమ‌క‌థ‌ని మించి, ఆత్మాభిమానం అనే అంశాన్నీ బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అది ఈ సినిమాని ప్ర‌త్యేకంగా నిలిపింది.

మ‌ల్లి, ల‌క్ష్మిల ప్రేమ‌క‌థ‌తో మొద‌ల‌య్యే క‌థ ప్రారంభ‌మైన కొద్దిసేపటికే ఆ ఊరు చిర‌త‌ప‌ల్లికి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లి అందులో ఓ పాత్ర‌లా మారుస్తుంది. స‌హ‌జ‌మైన స‌న్నివేశాలు, పాత్ర‌ల తీరుతెన్నులు, సంభాష‌ణ‌లు అంత‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ప్రేమ‌క‌థ‌లో కొత్త‌ద‌న‌మేమీ లేదు కానీ 2007 నాటి వాతావ‌ర‌ణం, అప్పుడ‌ప్పుడే సెల్‌ఫోన్లు వ‌స్తున్న ఆ కాలం నాటి లవ్​ లెటర్​ నేపథ్యంతో సినిమా స‌ర‌దా సర‌దాగా సాగుతుంది. మ‌రోవైపు కులాల మ‌ధ్య అంత‌రాల్ని, ఆర్థిక అస‌మాన‌త‌ల్నీ స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ క‌థ‌తో కనెక్ట్ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్​ ముందు నుంచి క‌థ మరో మ‌లుపు తీసుకుంటుంది. అప్పటిదాకా లవ్​ స్టోరీ కీల‌కం కాగా, ఆ తర్వాత నుంచి ఆత్మాభిమానం అంశం ప్ర‌ధానంగా మారుతుంది.

సెకండాఫ్​లో మ‌ల్లి, అత‌ని ఫ్యామిలీ చేసే పోరాటం చుట్టూనే కథ సాగుతుంది. ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నప్పటికీ, బ‌ల‌మైన సీన్స్​, డ్రామాతోనూ ప్ర‌భావం చూపించాడు డైరెక్టర్. పోలీస్ స్టేష‌న్‌లో సాగే సీన్స్​, ప్రేమ ప్రాణాల‌ మీదకు తేకూడ‌దు అంటూ మ‌ల్లి, ల‌క్ష్మి తీసుకునే నిర్ణ‌యం, ఆ నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆడియెన్స్​ను ఆక‌ట్టుకుంటాయి. అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు నాట‌కీయంగా, ఎక్కువ స్వేచ్ఛ‌ని తీసుకుని మ‌లిచిన‌ట్టు అనిపించినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే చూపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే :
Ambajipeta Marriage Band Cast : పాత్ర‌లే త‌ప్ప న‌టులు క‌నిపించ‌ర‌నే విష‌యాన్ని రుజువు చేస్తుంది ఈ చిత్రం. న‌టులు ఆయా పాత్ర‌ల్లో అలా ఒదిగిపోయారు. మ‌ల్లి పాత్ర‌కి సుహాస్ స‌రైన ఎంపిక అనిపిస్తుంది. భావోద్వేగ ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. శివానీ నాగారం ల‌క్ష్మి పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు. శ‌ర‌ణ్య ప్ర‌దీప్ ఈ సినిమాకి మ‌రో హీరో. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె న‌టించిన విధానం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అన్న‌ద‌మ్ములుగా నటించిన నితిన్‌, విన‌య మ‌హాదేవ్, హీరోకి స్నేహితుడిగా క‌నిపించే జ‌గ‌దీష్ బండారి పాత్ర‌లు కూడా ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బ‌లాలు

+ క‌థ, నేప‌థ్యం

+ భావోద్వేగాలు

+ సుహాస్‌, శ‌ర‌ణ్య న‌ట‌న

బ‌ల‌హీనత‌లు

- ప్రేమ స‌న్నివేశాలు

చివ‌రిగా : అంబాజీపేట మ్యారేజీబ్యాండు - మ‌న‌సుల్ని గెలిచే సౌండు.

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Suhas New Movie : అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. సౌండ్ అదిరింది.. సుహాస్ యాక్టింగ్ కేక

తండ్రైన 'కలర్‌ ఫొటో' హీరో సుహాస్​ - ప్రొడక్షన్ నెం.1 అంటూ ఫొటో షేర్​

Last Updated : Feb 2, 2024, 10:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.