Amaran Sai Pallavi Intro Video : కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు తమ నేచురల్ యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు జంటగా కలిసి నటిస్తున్న చిత్రం 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. అక్టోబర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ ఇంట్రో వీడియోను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ఆసక్తిగా, కూల్ అండ్ ఎమోషన్‌గా సాగింది.
ఈ సినిమా మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ ఉండబోతుందని లెటెస్ట్ ఇంట్రో వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇంకా ఈ వీడియోలో సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. శివ కార్తికేయన్‌తో మంచి కెమిస్ట్రీ ఈ సినిమాలో కనిపించేలా ఉందని అనిపించింది. మొత్తానికి అమరన్ నుంచి సాయి పల్లవి ఫ్యాన్స్‌కు బ్యూటీఫుల్ ట్రీట్‌ను అందించారని చెప్పాలి.
ఇక ఈ చిత్రంలో విశ్వరూపం ఫేమ్ రాహుల్ బోస్ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రాన్ని ఎక్కువ భాగం కశ్మీర్‌లో చిత్రీకరించారట. 75 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిపినట్లు ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అలానే కశ్మీర్ షూటింగ్ లొకేషన్‌లో సాయిపల్లవి, శివ కార్తికేయన్ కలిసి దిగిన ఫొటోలు కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. అలానే విడుదల చేసిన మేకింగ్ వీడియోలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.
Sai Pallavi Upcoming Movies : ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే, ఆమె నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'తండేల్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణ్‌లోనూ సీతగా నటిస్తోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. దీంతో పాటే హిందీలో మరో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.
బ్లాక్ బస్టర్ 'దేవర' - OTTలోకి ఎన్ని రోజుల తర్వాత, ఎక్కడ వస్తుందంటే? - Devara Movie OTT Details