Amaran Siva karthikeyan Sai Pallavi : కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటించిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ అమరన్. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి హీరో కమల్‌హాసన్ నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.
అయితే తాజాగా సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో శివ కార్తికేయన్. సాయి పల్లవిని ప్రశంసించిన ఆయన, తనను ఆమె అన్నా అని పిలిచిందని గుర్తు చేసుకున్నారు. అలా ఆమె పిలవడంతో తాను ఫీలైనట్లు తెలిపారు. తాజాగా చెన్నై వేదికగా ఘనంగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తున్నప్పుడు సాయి పల్లవిని తొలి సారి కలిశాను. నేను వ్యాఖ్యతగా వ్యవహరించిన ఓ షోకు ఆమె హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఆమె పేరు ఒక బ్రాండ్. ప్రేమమ్‌లో ఆమె యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఫోన్ చేసి ప్రశంసించాను. ఆమె వెంటనే థ్యాంక్యూ అన్నా అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీలయ్యాను. ఆమె ఎంతో గొప్ప నటి" అని శివ కార్తికేయన్ చెప్పారు.
Sai Pallavi Amaran ఛ కాగా, ఈ చిత్రం అక్టోబరు 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో థియేట్రికల్ హక్కుల్ని శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ దక్కించుకుంది. ఇండియాస్ మోస్ట్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించారు. భువన్ అరోడా, రాహుల్ బోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కూడా సినీ ప్రియుల మనసును తాకింది.
సంక్రాంతి 'గేమ్ ఛేంజ్' - పండగ బరిలో ఏఏ సినిమాలు వస్తున్నాయంటే?
అలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది : VD 12పై విజయ్ దేవరకొండ అప్డేట్