ETV Bharat / entertainment

అతడు కాల్ చేసి నాతో అలా మాట్లాడాడు! : బాలీవుడ్​పై సాయి పల్లవి కీలక కామెంట్స్ - SAI PALLAVI ON BOLLYWOOD PR AGENCY

బాలీవుడ్‌ పీఆర్‌ ఏజెన్సీలపై హీరోయిన్ సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు!

Sai Pallavi on Bollywood PR Agency
Sai Pallavi on Bollywood PR Agency (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 10:05 AM IST

Sai Pallavi on Bollywood PR Agency : సౌత్‌ ఇండస్ట్రీలో అగ్ర తారలంటే ఒకప్పుడు నయనతార, త్రిష, సమంత పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు సాయి పల్లవి. ఎందుకంటే ఈ నేచురల్ ముద్దుగుమ్మ మనసుని హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. నటనకు ప్రాధాన్యమున్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటారు. మేకప్‌-ఫ్రీ లుక్‌తో, అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో యువ హృదయాలను గెలుచుకున్నారు.

అయితే ఆమె హీరో శివ కార్తికేయన్​తో కలిసి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్‌'. త్వరలో ఇది రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ ప్రమోషన్స్​లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌లో పీఆర్‌ ఏజెన్సీలపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం క్రితం బాలీవుడ్‌కు చెందిన ఒక వ్యక్తి తనకు ఫోన్‌ చేశారని చెప్పింది. "నన్ను ప్రమోట్‌ చేసుకోవడానికి, తరచూ వార్తల్లో ఉండటం కోసం పీఆర్‌ ఏజెన్సీ కావాలా? అని ఆ వ్యక్తి అడిగారు. అలా చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదనిపించింది. తరచూ నా గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకుల బోర్ ఫీలవుతారనిపించింది." అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

వారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తా : మరో ఇంటర్వ్యూలో హీరో శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ మిలిటరీ అధికారులతో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. మిలిటరీ అధికారులంతా ఎప్పుడూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తానని చెప్పారు.

Amaran Movie Budget and Cast Details : కాగా, ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథను ఆధారంగా చేసుకుని 'అమరన్‌' తెరకెక్కింది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించారు. కమల్ హాసన్‌ నిర్మించారు. అక్టోబర్‌ 31న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన్‌ అరోడా, రాహుల్‌ బోస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు. తెలుగులో థియేట్రికల్‌ హక్కుల్ని శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థ దక్కించుకుంది.

'అందుకే గ్లామరస్ పాత్రలకు దూరం- ఆ ఒక్క వీడియోనే కారణం!'

రాజమౌళి కూడా టచ్‌ చేయని జానర్​లో త్రివిక్రమ్‌-బన్నీ సినిమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.