ETV Bharat / entertainment

వామ్మో 'పుష్ప 2' బడ్జెట్​ అంత పెరిగిందా? - ఏకంగా ఎన్ని కోట్లంటే? - పుష్ప 2 500 కోట్లు

Alluarjun Pushpa 2 Budget : అల్లు అర్జున్ పుష్ప 2 బడ్జెట్​ ముందుగా అనుకున్న దాని కన్నా ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. దాదాపు 30 నుంచి 40 శాతం వరకు పెరిగిందట. ఆ వివరాలు.

వామ్మో 'పుష్ప 2' బడ్జెట్​ అంత పెరిగిందా? - ఏకంగా ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 9:19 AM IST

Alluarjun Pushpa 2 Budget : ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' తొలి భాగం సెన్సేషనల్ హిట్​ అయిన సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్​ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'పుష్ప 2' మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొద్ది రోజుల నుంచి సినిమా వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మూవీ అనుకున్న తేదికే రిలీజ్​ అవుతుందని మూవీటీమ్​ మరోసారి క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ సమయంలోనే మరో వార్త కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది.

అదేంటంటే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల బడ్జెట్​ బాగా పెరిగిపోయిందని తెలిసింది. ముందు అనుకున్న దాన్ని కన్నా 30 - 40 శాతం వరకు బడ్జెట్ పెరిగిందని బయట కథనాలు వస్తున్నాయి. మొదట రూ.350కోట్లు అని అంచనా వేసుకున్నారట. కానీ ఇప్పుడది రూ.500 వరకు అవుతున్నట్లు తెలిసింది. అయినా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ వెనకాడకుండా నిర్మిస్తున్నారట.

పైగా మొదటి నుంచి సుకుమార్ ఈ సీక్వెల్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్​తో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. స్క్రిప్ట్​ మీద కూడా కంటిన్యూగా కూర్చుంటున్నారని, సీన్స్​కు సంబంధించి ఔట్​ ఫుట్ కొంచెం సరిగ్గా రాకపోయినా మళ్లీ రీషూట్స్​ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమా బడ్జెట్​ పెరుగుతూ పోతుందని అంటున్నారు. అలాగే నిర్మాతలు కూడా ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారట.

Alluarjun Pushpa 2 Business : ఇకపోతే నిర్మాతలు తెలుగు రెండు రాష్ట్రాల నుంచే రూ. 200 కోట్ల వరకు బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నారట. గతంలో RRR చిత్రం తెలుగులో రూ.200 కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అదే రేంజ్​లో చేసేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట. కాగా, పుష్ప చిత్రానికిగాను అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దారు. కూలీగా తన జర్నీని మొదలుపెట్టిన పుష్పరాజ్‌ ఆ తర్వాత ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే అంశాలతో తొలి భాగాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో 'పుష్ప ది రూల్‌' రానుంది. గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సీన్స్​ సినిమాకు హైలైట్‌గా ఉండనున్నాయని టాక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

NBK 109 బాలయ్యకు జోడీగా శ్రద్ధ?

రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.