ETV Bharat / entertainment

అల్లు అర్జున్​ వారసుడు వచ్చేస్తున్నాడహో- ఆ సూపర్ హిట్ సీక్వెల్​తో ఎంట్రీ! - Allu Ayaan cameo role Pushpa 2

Allu Ayaan Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేలా బన్నీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్​తోనే అయాన్ ఎంట్రీ ఉంటుందని అంతా అంటున్నారు. ఆ సినిమా వివరాలను తెలుసుకుందాం.

అల్లు అర్జున్​ వారసుడు వచ్చేస్తున్నాడహో.. ఆ సూపర్ హిట్ సీక్వెల్​తో ఎంట్రీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 9:56 AM IST

Updated : Feb 25, 2024, 11:57 AM IST

Allu Ayaan Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్​గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క చిత్రంతో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇతర హీరోల అభిమానులు కూడా బన్నీని లైక్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్​తో బిజీగా ఉన్న బన్నీ ఖాళీ దొరికితే తన ఫ్యామిలీతోనూ ఎక్కువగానే సమయం గడుపుతుంటాడు. అయితే అల్లు అర్జున్​కు కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఉంది.

ఇప్పటికే అల్లు అర్హ - సమంత శాకుంతలం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అయాన్ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడని తెలిసింది. దీని కోసం బన్నీ ఓ సూపర్ ప్లాన్ వేశారని టాక్ వినిపిస్తోంది. అల్లు అయాన్​ ఇప్పటికే మోడల్​గా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. రీసెంట్​గా షారుక్ ఖాన్ పాట పాడి నెట్టింట్లో మరింత ఫేమస్ అయ్యాడు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ - అల్లు అయాన్​కు వస్తున్న క్రేజ్​ చూసి అతడిని కూడా సినిమా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఇందుకోసం పుష్ప 2లో ఓ పాత్రను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కెమియోగా పుష్ప 2లో అయాన్ కనిపిస్తాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ నిజమైతే బాగుండని అల్లు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Pushpa 2 Shooting Update : ఇకపోతే ఈ పుష్ప 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమాలోని కీలక యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని గ్రాండ్​గా నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రణ్​బీర్ - రష్మికను ఫాలో అవుతున్న రకుల్ - జాకీ - గాల్లో హనీమూన్ ప్లాన్!

శ్రీలీల ఎనర్జీ డ్యాన్స్​ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే - మీకు తెలుసా?

Last Updated : Feb 25, 2024, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.