Allu Arjun Rejected Salman Movie : ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్, టాలీవుడ్‌ల మధ్య షేరింగ్ కామనే. ఒకరి స్టోరీతో ఇంకొకరు హిట్‌లు కొట్టడం విన్నాం. ఆ కోవకు చెందినదే ఇది కూడా. ఒకసారి బాలీవుడ్‌కు చెందిన ఓ మూవీ టీమ్ అల్లు అర్జున్ కోసం కథను సిద్ధం చేసి వినిపిస్తే ఆయన దానికి నో చెప్పేశారట. కానీ అదే స్టోరీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశారు సల్మాన్ ఖాన్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే సల్మాన్ ఖాన్ కోసమే సిద్ధం చేసినట్లుగా అనిపించే ఈ కథ నిజానికి బన్నీ, సల్లూ భాయ్ లతో పాటు ఇంకొకరి దగ్గరకు కూడా వెళ్లి రిజెక్ట్ అయిందట.
'బజరంగీ భాయిజాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ పోషించిన పవన్ అనే పాత్రలో మరెవరినైనా ఊహించుకోగలమా. కచ్చితంగా కష్టమే. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మనస్సుల్లో గుర్తుండిపోయిన సినిమా అది. సల్మాన్ ఖాన్ సినీ జీవితంలోనే ఒక మైలురాయి లాంటిది ఆ సినిమా. ఈ మూవీ నిర్మాత ఉదయవాణి ముందుగా బన్నీతో పాటు రజినీకాంత్‌కు కూడా వినిపించారట. అవును ముందుగా అల్లు అర్జున్ ఈ కథలో లీడ్ రోల్ పోషించాలని అడిగారట. ఆయన నో చెప్పడంతో తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ను అడిగారట. ఇద్దరూ వేర్వేరు కారణాలతో కథకు నో చెప్పేశారట.
స్టైలిష్ హీరోగా పేరున్న అల్లు అర్జున్ ఆ టైంకి టాలీవుడ్‌లో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారట. అంతేకాకుండా సౌత్‌లో కెరీర్ మీద ఫోకస్ పెట్టిన ఈ సమయంలో బాలీవుడ్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమోననే అనుమానం వ్యక్తం చేశారట. అలా బన్నీ నో చెప్పిన తర్వాత తమిళ స్టార్ హీరో రజనీకాంత్‌ను సంప్రదించారట ప్రొడ్యూసర్లు. ఆయన కూడా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉన్నానని, ఈ కథకు తాను ఫిట్ అవనంటూ చేతులెత్తేశారట.
అల్లు అర్జున్, రజనీకాంత్‌లు రిజెక్ట్ చేసిన ఆఫర్‌ను సల్మాన్ ఖాన్ దగ్గరకు తీసుకెళ్లారు డైరక్టర్ కబీర్ ఖాన్. ఆ తర్వాత సల్మాన్ ఓకే చెప్పడం, సినిమా రిలీజ్ అవడం, హిట్ అవడం అన్నీ ఇండియన్ సినిమా ప్రేక్షకులకు తెలిసినవే. ఫ్యామిలీని మిస్ అయిన చిన్నారిని తిరిగి ఆ ఫ్యామిలీతో కలిపేందుకు జరిపే ప్రయత్నమే ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా రూ.960 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత భాయ్‌జాన్ అనే టైటిల్ కూడా సొంతం చేసుకున్నారు సల్మాన్.
ఇది విన్న ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భజరంగి భాయ్‌జాన్ సినిమాలో సల్మాన్ బదులుగా అల్లు అర్జున్ హీరోగా సినిమా వచ్చుంటే బన్నీ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచేదేమో అని కామెంట్లు పెడుతున్నారు.