Pushpa Dialogue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప పార్ట్- 1 దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజం, డైలాగ్స్, డాన్స్ స్టెప్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. వరల్డ్‌వైడ్‌గా ఆడియెన్స్ బన్నీ మేనరిజాన్ని ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు ఫైరు' డైలాగ్‌కు మాత్రం స్పెషల్ క్రేజ్ క్రియేటైంది. అయితే ఈ డైలాగ్ ఆలోచన మూవీ డైరెక్టర్ సుకుమార్‌ది కాదంట. దీని వెనకాల ఇంకో దర్శకుడు ఉన్నారట. ఆయన ఎవరంటే.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కారణంగా సుకుమార్ ఇంతటి క్రేడీ డైలాగ్ రాశారు. ముందుగా రాసుకున్న స్ర్కిప్ట్‌లో ఈ డైలాగ్ లేదంట. పుష్ప షూటింగ్ జరుగుతుండగా ఒక రోజు డైరెక్టర్ హరీశ్ శంకర్ సెట్స్‌కు వెళ్లారు. బన్నితో మాట్లాడుతుండగా 'మాస్ సినిమా తీస్తూ, క్లాస్‌గా 'పుష్ప' అని పెట్టడం బాగోలేదు డార్లింగ్' అని చెప్పారు. ఈ విషయాన్ని సుకుమార్ దగ్గర కూడా ప్రస్తావించారు. ప్రతి చిన్న సీన్లో క్లారిటీగా ఉండే సుకుమార్ టైటిల్ విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలని డిసైడయ్యారట. దీంతో 'పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైరు' అనే డైలాగ్ రాసి సినిమాలో చేర్చారు. అంతే ఈ ఒక్క డైలాగ్ సినీఇండస్ట్రీలోనే మార్మోగిపోయింది. నెటిజన్లు సోషల్ మీడియాలో లక్షల్లో రీల్స్ చేశారు.
ఇక అల్లు అర్జున్- సుకుమార్ ప్రస్తుతం పుష్ప పార్ట్- 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. రీసెంట్గా సినిమాలోంచి మేకర్స్ 'పుష్ప పుష్ప' ఫస్ట్ సింగిల్ (సాంగ్) రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 6 భాషల్లో కలిపి 50+ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ సీక్వెల్‌ను వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. కచ్చితంగా ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దిల్ రాజుతో పెద్ద గొడవ - కాళ్లు పట్టేసుకున్న సుకుమార్! - Dil Raju Sukumar
'పుష్ప' సాంగ్ జోరు ఆగేదేలే- 3రోజుల్లోనే 50మిలియన్లు, లక్ష ఇన్‌స్టా రీల్స్! - Pushpa 2 Records