ETV Bharat / entertainment

జాతర ఎపిసోడ్‌కు ఫుల్ విజిల్స్!- ఫ్యాన్స్​ రియాక్షన్​కు బన్నీ రిప్లై ఇదే! - PUSHPA 2 FANS REACTIONS

ఫ్యాన్స్​తో కలిసి సినిమా చూసిన అల్లు అర్జున్​ - జాతర ఎపిసోడ్‌కు ఫ్యాన్స్​ ఫిదా!

Allu Arjun Pushpa 2 Fans Reactions
Allu Arjun Pushpa 2 Fans Reactions (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 8:55 AM IST

Allu Arjun Pushpa 2 Fans Reactions : బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పుష్ప 2 థియేటర్లలోకి రానే వచ్చింది. గత కొద్ది రోజులుగా ఎటు చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. భారీ అంచనాలతోనే వచ్చిన ఈ చిత్రం పుష్ప ర్యాంపేజ్​తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లు ప్రేక్షకుల్లో జోష్‌ నింపుతున్నాయి.

ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్​గా నిలిచిందని అభిమానులు అంటున్నారు. గంగమ్మతల్లి అవతారంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్‌ తెప్పించారని అంటున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. అంతే కాకుండా ఐకాన్ స్టార్ తన యాక్టింగ్​తో సినిమా రేంజ్ పెంచేశారంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసిస్తున్నారు.

సంధ్యలో బన్నీ ఫ్యామిలీ
మరోవైపు అల్లు అర్జున్‌ 'పుష్ప 2' చూసేందుకు హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌కు వచ్చారు. తన ఫ్యామిలీ అలాగే ఫ్యాన్స్‌తో కలిసి ఈ సినిమా చూశారు. ఇక జాతర ఎపిసోడ్ సమయంలో ఆడియన్స్‌ బన్నీకి సలాం కొట్టగా, దానికి అల్లు అర్జున్‌ విజయోత్సహంతో తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ మూమెంట్​కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అల్లు అయాన్ స్పెషల్ నోట్
ఇదిలా ఉండగా, 'పుష్ప 2' విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్‌కు తన కుమారుడు లెటర్ రూపంలో ఓ స్వీట్​ నోట్​ షేర్ చేశాడు. "నాన్నా నిన్ను, నీ విజయాన్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నిన్ను నెంబర్‌1గా చూస్తుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ రోజు వెరీ స్పెషల్. ప్రపంచంలోనే ఓ గొప్ప నటుడి సినిమా రిలీజ్‌ అవుతోంది. నువ్వెప్పుడూ నా హీరోవే. నీకు ఉన్న ఎంతోమంది అభిమానుల్లో నేను మొదటివాడిని" అని అల్లు అయాన్ రాసుకొచ్చాడు.ఇక ఆ లేఖను బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్స్​లో షేర్ చేశారు. ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో ఇది అతి పెద్దదంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ప్రేమను పొందటం తన అదృష్టమని ఆ పోస్ట్​కు క్యాప్షన్ జోడించారు.

ఫ్యాన్స్​కు వైల్డ్​ ఫైర్ ట్రీట్ - అల్లు అర్జున్‌ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రూ.300 కోట్ల రెమ్యునరేషన్​, ఆ సీక్వెన్స్​ కోసం రూ.60 కోట్ల ఖర్చు, - 'పుష్ప 2' గురించి 11 ఆసక్తికర విషయాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.