Akshay Kumar Oh My God 2 Movie OTT : ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా అన్ని జానర్ సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో మూవీ లవర్స్ ఖాళీ దొరకగానే ఎంచక్కా ఉన్న చోటే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీకెండ్ దగ్గర పడడంతో మరికొన్ని కొత్త సినిమా సిరీస్‌లు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి ఓ మై గాడ్ 2.
బాలీవుడ్‌లో బ్లాక్ బాస్టర్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే హీరో అక్షయ్ కుమార్ నటించిన సినిమా ఇది. కానీ ఆయనకు గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్‌లు వెంటాడుతున్నాయి. అలాంటి సమయంలోనే గతేడాది ఆగస్ట్‌లో ఓ మై గాడ్ 2 వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ ముందు రూ. 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది బాలీవుడ్‌లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కెరీర్‌కు కాస్త ఊరట ఇచ్చింది. అలానే ఓటీటీలోనూ హిందీ వెర్షన్లో విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.
దీంతో ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు గురువారం(ఏప్రిల్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు.
2012లో విడుదలైన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ఓ మై గాడ్ 2 వచ్చింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో ఆకట్టుకున్నారు. మొదట దీనిపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డ్ కూడా ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొంది. అయినా ఈ చిత్రం అన్నింటినీ దాటుకుని వచ్చి థియేటర్లలోకి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాగా, గత కొన్నేళ్లుగా అక్షయ్‌కు బ్యాడ్‌టైమ్ నడుసున్న సంగతి తెలిసిందే. 2020 - 2024 నాలుగేళ్ల కాలంలో అక్షయ్ 14 సినిమాల్లో నటించగా పన్నెండు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఆయన తాజా చిత్రం బడే మియా చోటే మియా కూడా నిర్మాతలకు నష్టం మిగిల్చిందని తెలిసింది. అయినా ఆయన చేతిలో ఇంకా పది సినిమాల వరకు ఉన్నాయి. సింగం అగైన్, వెల్‌కమ్ టూ ది జంగిల్, స్కై ఫోర్స్, శంకర, ఖేల్ ఖేల్ మేతో పాటు మరో ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది వీటిలో నాలుగైదు సినిమాల వరకు విడుదల కానున్నాయి.
OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా - డోంట్ మిస్! - Avesham Movie
'మలయాళ సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడానికి కారణమిదే' - Fahadh faasil