ETV Bharat / entertainment

'మేం వచ్చేస్తున్నాం, మా నాన్నను ఆపడం కుదరదు'- ఐశ్వర్య ఫ్యామిలీకి అభిషేక్ షాకింగ్ సర్​ప్రైజ్

తాను అభిషేక్​ను ప్రేమిస్తున్న సమయంలో బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి ఐశ్వర్య రాయ్ ఇంటికి వెళ్లిపోయారట. తన తండ్రి కూడా లేని సమయంలో తల్లితో కలిసి ఎదుర్కొన్న ఆ సిచ్యుయేషన్ గురించి ఐశ్వర్య మాటల్లో.

Aishwarya Rai Engagement
Aishwarya Rai Engagement (Getty Images, Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 12:03 PM IST

Aishwarya Rai Engagement : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ అటు నార్త్​లోనే కాకుండా ఇటు సౌత్​లోనూ సూపర్ పాపులర్ అయ్యారు. పెళ్లయ్యాక సెలెక్టడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్​లో సెటిలైన ఈ సుందరి 'పొన్నియిన్ సెల్వన్'​తో మరోసారి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా నిలిచారు.

అయితే బిగ్​బీ అమితాబ్ బచ్చన్ కోడలిగానూ ఈమె పలు విషయాల్లో ట్రెండ్ అయ్యారు. బీటౌన్​లో పాపులరైనప్పటికీ సౌత్​కు చెందిన వ్యక్తి కావడం వల్ల పెళ్లి విషయంలో పాటించే సంప్రదాయాల విషయంలో ఎదుర్కొన్న ఓ గమ్మత్తైన పరిస్థితి కారణంగా తనతో పాటు తన తల్లిని కూడా తికమక పెట్టేశారట. ఓ ప్రముఖ చాట్ షోలో ఆమె ఎదుర్కొన్న ఆ సంఘటన గురించి పేర్కొన్నారు ఐశ్వర్య.

"రోకా అనే కార్యక్రమం ఉంటుందని మాకు తెలియదు. మేం సౌత్​కు చెందిన సంప్రదాయలను ఫాలో అవుతుంటాం. అసలు దాని గురించే తెలియని మాకు, ఒకేసారి మేం వస్తున్నామంటూ అభిషేక్ నుంచి కాల్ రావడం వల్ల షాకింగ్‌గా అనిపించింది. మా నాన్నను ఆపలేను, మేమంతా మీ ఇంటికి వస్తున్నాం అంటూ అభిషేక్ చెప్పిన వెంటనే నేను, ఓరి దేవుడా అని అనుకున్నాను " అంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ఐష్. అయితే తన తండ్రి లేకుండానే 'రోకా' కార్యక్రమం హఠాత్తుగా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆయనకు కేవలం ఫోన్‌లో మాట్లాడటమే కుదిరిందట. దీంతో తన తల్లితో కలిసి ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేశారట.

ఇంతకీ రోకా సంప్రదాయం అంటే ఏంటి?
సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం కంటే ముందుగానే వధువు ఇంటికి వరుడు కుటుంబం వెళ్లడమే 'రోకా' అనే కార్యక్రమం అంట. అనుకోకుండా జరిగినా కూడా ఆ రోజు నుంచే బచ్చన్ కుటుంబంతో తమ ఫ్యామిలీకి అనుబంధం పెరిగిందట. ఇక పెళ్లి తర్వాత కోడలిగా బచ్చన్ ఫ్యామిలీలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా బలపడిందట. 2007 ఏప్రిల్ 20న దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లది ప్రేమ వివాహం అని మనందరికీ తెలిసిందే. వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కూమార్తె కూడా ఉంది.

ఐశ్వర్యను తొలిసారి చూసినప్పుడు నేను అలా: అభిషేక్

'ఆ అరుదైన అవకాశం ఆరాధ్యకు దక్కింది.. అదొక తీపి జ్ఞాపకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.