ETV Bharat / entertainment

హృతిక్, రణ్​బీర్‌లతో ఐష్​ కిస్​ సీన్స్ - 'హద్దులు పెట్టుకుంటూ ఉంటే ఎదగలేం' - Aishwarya About Liplock Scenes - AISHWARYA ABOUT LIPLOCK SCENES

సౌత్​తో పాటు నార్త్​లోనూ సూపర్​ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్​. ఐదు పదుల వయసులోనూ తన నటనతో అభిమానుల మనసులు కొల్లగొడుతోంది. అయితే ఆమె పలు సినిమాల్లో స్టార్స్​తో లిప్​లాక్ సీన్స్​ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తాజాగా ఆ ముద్దు సీన్స్ గురించి ఆమె ఓపెనప్ అయ్యింది

Aishwarya Liplock With Heros
Hritik Roshan Aishwarya Rai Ranbir Kapoor (Getty Images, Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 8:17 AM IST

Aishwarya About Liplock Scenes : మత్తెక్కించే కళ్లు, చెక్కిన శిల్పం లాంటి శరీరాకృతితో కొన్ని దశాబ్దాల పాటు కుర్రకారు గుండెల్ని పిండేసింది మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్. కొన్నాళ్ల పాటు ఎందరో యువతులకు ఈమె రోల్ మోడల్ గా కూడా నిలిచింది. బాలీవుడ్ టాప్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ నుంచి హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ వరకూ అందరితో రొమాంటిక్​ సీన్స్​లో నటించింది. కెరీర్ ఆరంభంలో కొన్నేళ్ల పాటు కండీషన్లతో నటించిన ఐష్, రూల్స్ బ్రేక్ చేసి లిప్ లాక్ సీన్లు, ఇన్టిమేట్ సీన్లలోనూ నటిస్తోంది. అయితే ఆమె ఇలా చేయడానికి వెనక కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

2016లో రణబీర్ కపూర్‌తో కలిసి 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో రొమాంటిక్ సీన్స్​లో కనిపించారు ఐశ్వర్య. ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ చిత్రంలో తన నటన గురించి మాట్లాడిండి. తనను తాను తెలివైన నటిగా అభివర్ణించుకుని, ఆమె ఎప్పుడూ అంచనాలకు అందని ప్రదర్శన మాత్రమే చేస్తుంటానని చెప్పింది. అంతేకాకుండా ఒక నటిగా బట్టల గురించి పట్టించుకుంటామా, కండీషన్లు పెట్టుకుంటూ ఉంటామా అనేది నిర్ణయించుకునే హక్కు తనకుంటుందని పేర్కొంది.

'ధూమ్- 2' గురించి కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. "అప్పటికే కెరీర్ స్టార్ట్ అయి పదేళ్లు అవుతుంది. కెరీర్ ఆరంభంలో ముద్దు సీన్లు లాంటి ఇంటిమేట్ సీన్లు చేయడానికి ఇష్డపడే దాన్ని కాదు. కానీ కాలానుగుణంగా పాత్రకు తగ్గట్టుగా, సీన్‌కు తగ్గట్టుగా మారడం నేర్చుకున్నాను. తెరపైన కనిపించి అలరించేందుకు సినిమా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ధూమ్- 2లో హృతిక్‌తో కలిసి ముద్దు సీన్ చేస్తున్నప్పుడు మేం ముందుగానే మాట్లాడుకున్నాం. దాన్ని కేవలం సీన్‌లాగానే భావించాలని అనుకున్నాం. ఆ కిస్ మధ్యలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ సీన్ షూట్ అయిపోయిన వెంటనే దూరం జరిగిపోయాం కూడా. సినిమాలో చూపించినట్లుగా ఆ సన్నివేశం జరుగుతున్నంతసేపు బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే అవడం లాంటిది కూడా లేదు" అని ఆ లిప్ లాక్ సీన్ గురించి క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య రాయ్ బచ్చన్.

ఆన్‌స్క్రీన్ మీద కనిపించాలనే ఆశ ఉన్నప్పుడు అన్నీ అనుకున్నట్లుగానే పర్ఫెక్ట్‌గా ఉండాలని హద్దులు పెట్టుకుంటూ ఉంటే నటిగా కెరీర్లో ఎదగలేమని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

అమితాబ్​ ఫ్యామిలీలో మరో బ్రేకప్​ - ఐశ్వర్య, అభిషేక్ మాత్రం కాదు! - Amitabh Bachchan Family Divorce

వ‌య‌సు పెరిగినా తగ్గని క్రేజ్‌, సంపాద‌న- భారత్​లోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.