ETV Bharat / entertainment

50 సెకెన్లకు రూ. ఐదు కోట్లు - ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా - Actress Charged 5 Cr For 50 Sec AD

Actress Who Charged Rs. 5 Crore For 50 Seconds AD : పాన్ఇండియా మేనియా నడుస్తున్న కొద్ది నటీనటులు కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక వాళ్ల సినిమాల లిస్ట్​తో పాటు రెమ్యూనరేషన్​ కూడా పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్​ కూడా ఓ చిన్న యాడ్​కు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్​ ఛార్జ్ చేసి ట్రెండ్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

Actress Who Charged Rs 5 Crore For 50 Seconds AD

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 4:14 PM IST

Updated : Mar 17, 2024, 8:54 PM IST

Actress Who Charged Rs. 5 Crore For 50 Seconds AD : కొంత మంది స్టార్ హీరోయిన్లు తమ పరిధిని దాటి ఇతర భాష సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి డిమాండ్​ కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మన సౌత్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవలే సమంత బాలీవుడ్​లో ఓ సిరీస్​కు సైన్​ చేసిన సంగతి తెలిసిందే. ఇక నయనతార కూడా 'జవాన్' సినిమాతో బీటౌన్​ ప్రేక్షకులను అలరించింది. ఇలా నటీమణులు తమ ట్యాలెంట్​తో పాన్ ఇండియా లెవెల్​లో దూసుకెళ్తున్నారు.

ఇక వారికున్న క్రేజ్​తో కొన్ని సార్లు హీరోలకు దీటుగా భారీ పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఎంతలా అంటే ఒక్క 50 సెకండ్ల అడ్వర్టైజ్‌మెంట్‌కు రూ.5 కోట్లు వసూలు చేసేంత. అప్పట్లో హీరోల పారితోషకం కంటే హీరోయిన్లకు వచ్చేది చాలా తక్కువ. కానీ రోజులు మారాయి. అందరూ కాకపోయిన కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీ ద్వారా బాగానే వెనకేసుకుంటున్నారు. ఇదంతా బాలీవుడ్ వరకే అనుకుంటే మళ్లీ మీరు పొరపడ్డట్టే. ఎందుకంటే కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనెలు యాడ్‌ల కోసం తీసుకునే మొత్తంతో పోటీపడే హీరోయినల్లు ఇప్పుడు సౌత్ లోనూ ఉన్నారు. ఒకింత షాకింగ్ గా అనిపించినా మరోవైపు ఇది గర్వించదగ్గ అంశమే.

ఇంతకీ ఆమె ఎవరంటే ?
ఇప్పటికే మనం మాట్లాడుకునే హీరోయిన్ పేరు గురించి మీకొక ఐడియా వచ్చేసి ఉండాలి. ఇంకెవరోకాదు ఒక రీజనల్ న్యూస్ ఛానల్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఓవర్ ఆల్ ఇండియా మెచ్చుకునే అంత స్థాయికి ఎదిగిపోయిన నయనతార. పర్ఫెక్ట్ టైమింగ్‌తో పాటు అదే రేంజ్ యాక్టింగ్‌తో మెప్పించగలిగే ఈ భామే భారీ పారితోషకం వసూలు చేస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు 'చంద్రముఖి' సినిమాతో పరిచయమైన నయన్, తను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ బెటర్ పర్‌ఫార్మెన్స్ కనబరుస్తూ నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన యువ తారలకు ధీటుగా పోటీపడుతున్నరు. అందంతో పాటు చక్కటి అభినయంతో అభిమానులను కట్టిపడేస్తుంటుంది ఈ తార. అయితే సినిమాల్లోనే కాకుండా పలు యాడ్స్​లోనూ మెరిసిందీ ఈ భామ.

ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ సైటిలైట్ కేబుల్ సంస్థ కోసం చేసిన 50 సెకన్ల యాడ్​కు ఆమె ఏకంగా రూ.5 కోట్లు అందుకున్నారు నయన్. పైగా ఈ యాడ్ షూటింగ్ జరిగింది కేవలం రెండు రోజులు మాత్రమే. తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ తమ మార్కెట్ పెంచుతుందని భావించి ఆ సంస్థ కూడా ఏ మాత్రం వెనుకాడకుండా నయనతార అడిగిన మొత్తాన్ని ముట్టజెప్పారట. ఇండియా మొత్తం మార్కెట్ సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం ఒక సినిమాలో నటించేందుకు రూ.10 కోట్లు తీసుకుంటుందని సమాచారం

'చమయం' అనే టీవీ షో కోసం తొలిసారి మేకప్ వేసుకున్న ఈ భామా డయానాగా ఉన్న ఆమె పేరును మలయాళం సినిమా అయిన 'మనస్సినక్కరే' కోసం నయనతారగా మార్చుకుంది. అదే ఆమె గొప్ప కమర్షియల్ సక్సెస్ తెచ్చిపెట్టిందని కొందరి మాట. రీసెంట్​గా బాలీవుడ్ బాద్ షా షారుక్​ ఖాన్​తో కలిసి అట్లీ డైరక్షన్ లో 'జవాన్' సినిమాలో నటించింది. అందులో ఆమె నటనకు సౌత్ లోనే కాదు ఇండియా మొత్తం ఆమెకు ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు.

ఇక సౌత్​లో చివరిసారిగా 'అన్నపూర్ణి'లో కనిపించారు. అది కూడా ఒక ఓటీటీ సినిమా. ఈ సినిమా చాలా కాంట్రవర్సీలతో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఎస్ శశికాంత్ డైరక్షన్​లో ఆర్ మాధవన్, సిద్దార్థ్, మీరా జాస్మిన్ లతో పాటు తెరకెక్కుతున్న సినిమాలో కనిపించనున్నారు. ఈ సమ్మర్ లోనే దీనిని రిలీజ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎంట్రీ- IAS కావాలని ఇండస్ట్రీకి దూరం!- ఆ నటి ఎవరంటే?

'ఐరన్ లెగ్' ట్యాగ్​తో 13 సినిమాల నుంచి ఔట్​- కట్ చేస్తే​ ఇప్పుడామె ఖాతాలో రూ.100 కోట్ల సక్సెస్​!

Last Updated : Mar 17, 2024, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.