ETV Bharat / entertainment

గుర్తుంచుకో, అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది : కాంట్రవర్సీ వేళ నయన్ పోస్ట్​

నయనతార కర్మ సిద్ధాంతాం పోస్ట్- సోషల్ మీడియాలో వైరల్- ఎవరిని ఉద్దేశించి పెట్టారో?

Nayanthara Dhanush Controversy
Nayanthara Dhanush Controversy (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 6:45 PM IST

Nayanthara Controversy : లేడీ సూపర్ స్టార్ నయనతార- హీరో ధనుశ్ మధ్య కాంట్రవర్సీ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్​ టాపిగ్​గా మారింది. నయన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుశ్​ తీరును ఆమె తప్పుబట్టారు. దీంతో ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నయన్ సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్​ వైరల్​గా మారింది.

కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి నయన్ ఓ పోస్ట్​ను ఆమె ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో షేర్ చేశారు. 'అబద్ధాలతో ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తే, దాన్ని మీరు ఒక అప్పులాగా భావించండి. ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి' అనేది ఆమె పోస్ట్​ సారాంశం. అయితే ఆమె ఉన్నట్టుండి ఈ పోస్ట్‌ ఎందుకు షేర్ చేశారో మాత్రం తెలియదు.

అందుకేనా?
'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమాకు సంబంధించి 3 సెకన్ల వీడియో క్లిప్​​ను డాక్యుమెంటరీ ట్రైలర్​లో చూపించినందుకు ఆ చిత్ర నిర్మాత ధనుశ్ రూ.10 కోట్లు నష్ట పరిహారంగా​ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే నయన్ దంపతులకు ఆయన లీగల్‌ నోటీసులు కూడా పంపించారు. అలాగే ఈ విషయంపై ధనుశ్ ఇటీవల మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. నయన్‌ - విఘ్నేశ్‌ దంపతులపై దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే నయన్ పరోక్షంగా ధనుశ్​ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.

కాగా, 'నయనతార : బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అందులో నయన్​ కెరీర్‌, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను ఆ డాక్యుమెంటరీలో చూపించారు. ముఖ్యంగా విఘ్నేశ్‌ శివన్‌తో తనకు ఏర్పడ్డ పరిచయం, వారి లవ్​ స్టోరీ, పెళ్లి వేడుకను ఇందులో చూపించారు. అయితే విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్ట్ చేసిన 'నానుమ్‌ రౌడీ దాన్‌'లో నయనతార హీరోయిన్‌గా నటించారు. ధనుశ్​ నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ సినిమా సెట్‌లోనే నయన్‌ - విఘ్నేశ్‌ల స్నేహం మొదలైంది. అందుకే ఈ మూవీ వీడియోలు, పాటలను డాక్యుమెంటరీకి జత చేయాలని వారు భావించినట్లు తెలుస్తోంది.

ముదిరిన డాక్యుమెంటరీ వివాదం - నయన్​ దంపతులపై ధనుశ్​ దావా

ఈవెంట్​లో పక్కపక్కనే ధనుశ్, నయన్- కాపీరైట్స్ కాంట్రవర్సీ తర్వాత ఫస్ట్ ​టైమ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.