ETV Bharat / entertainment

'నన్ను ఎంతగానో వేధించారు' : స్టార్‌ హీరోపై నటి ఆరోపణలు! - Hema Committee Report - HEMA COMMITTEE REPORT

Hema Committee Report : ప్రముఖ నటులుపై నటి మిను సంచలన ఆరోపణలు చేశారు. వారి వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

source Getty Images
Hema Committee Report (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 11:28 AM IST

Hema Committee Report Actress Minu Allegations on Mollywood Actors : మాలీవుడ్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఓ రిపోర్ట్‌ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో షాకింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. ఇప్పుడీ రిపోర్ట్​ అంతటా చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలో పలువురు తారలు బయటకు వచ్చి ధైర్యంగా తమకు ఎదురైన పరిస్థితులు, చేదు అనుభవాల్ని గురించి మాట్లాడుతున్నారు. మరి వారు చెప్పే విషయాల్లో నిజం ఉన్నాయో లేదో తెలీదు కానీ, వారు చేసే కామెంట్స్​ చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా నటి మిను కూడా సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేసింది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్​ వల్ల తాను వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు మణియన్‌పిళ్ల రాజు, ముఖేశ్‌, ఇడవేల బాబు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ నోబల్‌, విచు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరంతా తనను అసభ్య పదజాలంతో దూషించారని చెప్పింది. వారి వేధింపులు మితిమీరిపోవడంతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలి చెన్నైకు వెళ్లిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్​ వైరల్​గా మారాయి.

"మణియన్‌పిళ్ల రాజు, ముఖేశ్‌, జయసూర్య, ఇడవేల బాబు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ నోబల్‌, విచు వల్ల నేను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. వారు నన్ను వేధింపులకు గురి చేశారు. అసభ్య పదజాలంతో నన్ను దూషించారు. 2013లో ఒక ప్రాజెక్ట్‌ కోసం పని చేసినప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాను. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం పని చేయాలనుకున్నాను. కానీ వారి వేధింపులు హద్దులు దాటాయి. వారు నన్ను మాలీవుడ్​ను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారు. ఈ పరిస్థితుల గురించి అప్పుడే లోకల్ న్యూస్ పేపర్స్​కు చెప్పాను. ఈ సంఘటన వల్ల ఎంతో మానసికంగా కుంగిపోయాను. న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. వారు చేసిన పనికి తగిన శిక్షను అనుభవించాలి" అని మిను చెప్పుకొచ్చారు.

ఈ వారమే సరిపోదా శనివారం, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్​ - OTT/థియేటర్​లో రాబోయే చిత్రాలివే! - This Week OTT Theatre Releases

కొత్త ప్రేమలో అలియా భట్​ - రహస్యాల వేటలో కరీనా - Bollywood Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.