Actor Suriya First Movie Offer : పేరుకే ఆయన కోలీవుడ్ హీరో కానీ సూర్యకు తమిళంలోనే కాదు మిగతా భాషల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ఆయన్ను సొంత మనిషిలా ఆదరిస్తూ, ఆయన సినిమాలను ఇక్కడ సపోర్ట్ చేస్తుంటారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఈయన స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిపోయారు. ఇప్పటికే పలు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన, త్వరలో 'కంగువా' అనే భారీ ప్రాజెక్ట్‌తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనూ పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
అయితే తాను తొలుత సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదట. ఆయన డ్రీమ్ వేరేది ఉండేదట. కానీ తన జీవితంలో జరిగిన ఓ ఘటన తనను ఈ ఇండస్ట్రీలోకి వచ్చేలా చేసిందని సూర్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఆయన ఓ ప్రముఖ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అసలు తనకు మొదటి ఆఫర్ ఎలా వచ్చిందన్న విషయాల గురించి మాట్లాడారు.
"యాక్టర్ అవ్వడం కంటే ముందు మా నాన్న ఓ ఆర్టిస్. సుమారు 8 ఏళ్ల పాటు ఆయన ఆ ఫీల్డ్‌లో వర్క్ చేశారు. కానీ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఇండస్ట్రీలో ఆయన ఉన్నా కూడా ఫ్రెండ్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ ఎవ్వరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. మేము కూడా సినిమాల గురించి ఇంట్లో పెద్దగా మాట్లాడుకునే వాళ్లం కాదు. నేను కమల్ హాసస్ సర్‌కు పెద్ద ఫ్యాన్. అలా ఆయన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం నాకు అలవాటు. కానీ నేనెప్పుడు యాక్టర్ కావాలని, సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. అయితే నాకు మా బంధువులను చూసి టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని అనిపించింది. 10వ తరగతి తర్వాత నుంచే నేను ఆ ఫీల్డ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. అలా బీకామ్ పూర్తి చేశాక చెన్నైలోని ఓ గార్మెంట్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. అక్కడ నేను దాదాపు మూడేళ్లు పని చేశాను. అప్పుడు కూడా నాకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన రాలేదు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా నేను సినిమాల్లోకి నటించాలని డిసైడ్ అయ్యాయి. ఒకానొక సమయంలో మేము రూ.25 వేలు ఒకరికి కట్టాల్సి వచ్చింది. అయితే మా అమ్మ వడ్డాణం కుదువ పెట్టి మరీ ఒకరి దగ్గర ఆ డబ్బు తీసుకున్నారు. ఈ విషయం మా నాన్నకు అస్సలు తెలియదు. కానీ ఆ డబ్బును ఎలాగొలా సర్దుదాం అనుకున్నప్పుడు ఇంటి పరిస్థితుల కారణంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాం. దీంతో నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడే ఓ డైరెక్టర్ నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన తీస్తున్న సినిమాలోని ఓ ప్రముఖ వ్యక్తి ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల వాళ్లు మరో యాక్టర్ కోసం వెతకటం ప్రారంభించారు. అలా ఆఫర్ నన్ను వరించింది." అని సూర్య తన ఫస్ట్ మూవీ ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు.
'ముంబయికి షిఫ్ట్ అవ్వడానికి కారణం ఆమెనే! - నా కోసం జో ఎన్నో వదులుకుంది'
'20 ఏళ్ల తర్వాత రోలెక్స్ కోసమే అలా చేశా - కమల్‌హాసన్ అంటే భయమేసింది!' - సూర్య