Actor Gurucharan Singh : గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఏప్రిల్ 22న అదృశ్యమైన ప్రముఖ టీవీ షో "తారక్ మెహతా కా ఉల్టా చష్మా" ఫేం గురుచరణ్ దాదాపు 24రోజుల తర్వాత మే 17న తిరిగి క్షేమంగా ఇంటికి చేరారు. ఆయన ఇన్ని రోజుల పాటు ఆధ్మాత్మిక సేవలో గడిపారని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
అసలేం జరగిందంటే? ఏప్రిల్ 22న తండ్రి పుట్టిన రోజు సందర్భంగా దిల్లీకి వచ్చారు నటుడు గురు చరణ్. తర్వాత ఇంటి నుంచి ముంబయి వెళ్తున్నా అని బయల్దేరిన ఈయన ముంబయి ఫ్లేట్ ఎక్కలేదు. తిరిగి దిల్లీలోని తండ్రి దగ్గరకు రాలేదు. ఎంతసేపటికీ గురుచరణ్ ఆచూకీ తెలియ లేదు. ఏప్రిల్ 24 తర్వాత ఆయన ఫోన్ కూాడా పనిచేయకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ గురుచరణ్ తండ్రి హర్గిత్ సింగ్ దిల్లీ పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న అధికారులు గురు చరణ్ కోసం గాలింపులు చేపట్టారు. ఆయన ఆచూకీ లభించకపోవడంతో దిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా గురుచరణే స్వయంగా ఇంటికి తిరిగొచ్చేశారు. తిరిగి ఇంటికి వచ్చిన గురుచరణ్‌ను విచారించిన పోలీసులు ఈ 24రోజుల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా పలు ప్రదేశాలు తిరిగారని తెలిపారు. అమృత్ సర్, లూథియానా సహా దేశంలోని ప్రముఖ గురుద్వార్‌లను గురు చరణ్ సందర్శించినట్లు పేర్కొన్నారు. ధ్యానం చేసేందుకు హిమాలయాలకు వెళ్లాలని గురుచరణ్ ఆసక్తి చూపుతున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు.
కాగా, బాలీవుడ్లో పాపులర్ టీవీషోగా పేరు గాంచిన "తారక్ మెహతా కా ఉల్టా చష్మా షో"లో గురుచరణ్ - రోహన్ సింగ్ సోధీ పాత్రలో నటించారు. ఈ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన తండ్రి అనారోగ్యం కారణంగా 2020లో షో నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆయన కనిపించకుండా పోయారు అనడంతో కంగారు పడ్డ అభిమానులు ఆచూకీ తెలియగానే సంతోషం వ్యక్తం చేశారు.
మోదీ బయోపిక్‌లో కట్టప్ప సత్యరాజ్ - PM MODI BIOPIC
బాలయ్య కొత్త సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే? - NBK 109 Movie