Aamir khan PK Movie : చాలా మంది హీరోలు తాము నటించే సినిమా కోసం, పాత్ర కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు. అవసరమైతే నగ్నంగా కూడా కనిపించిన సందర్భాలున్నాయి. అలాంటి వారిలో ఆమిర్ ఖాన్ ఒకరు. 2014లో వచ్చిన పీకే సినిమాలో గ్రహాంతరవాసిగా కనిపించి ఆకట్టుకున్నారు. అలానే ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో నగ్నంగానూ కనిపించారు. ఇప్పటికీ ఈ చిత్రం ఇండియావైడ్‌గా హెయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. అయితే పదేళ్ల తర్వాత ఆ మూవీ షూటింగ్ విశేషాలను తాను పాల్గొన్న ఒక టీవీ షోలో పంచుకున్నారు ఆమీర్ ఖాన్. తాను ఎందుకు నగ్నంగా నటించారో తెలిపారు.
టీవీ షోలలో బాగా పాపులరైన కపిల్ శర్మ కామెడీ షోకు గెస్ట్‌గా వెళ్లారు ఆమీర్ ఖాన్. మాములుగా టీవీ షోలకు, అవార్డు ఫంక్షన్స్ కు, మిగతా ఈవెంట్స్‌కు ఎక్కువగా దూరంగా ఉండే ఆమీర్ ఖాన్ మొదటిసారిగా ఈ టీవీ షోలో గెస్ట్‌గా వెళ్లారు. అయితే అక్కడ పీకే సినిమా షూటింగ్ అనుభవాలను చెప్తూ తాను నగ్నంగా కేవలం రేడియో మాత్రమే పట్టుకుని పరిగెత్తే సన్నివేశం గురించి వివరించారు.
"ఈ సీన్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్ అందరి ఫోన్స్ తీసేసుకున్నారు. ఆ తర్వాత నాకు చిన్న షార్ట్ ఇచ్చారు. కానీ దానితో పరిగెత్తడం చాలా ఇబ్బందిగా అనిపించింది. దాన్ని తీసేస్తాను అని అక్కడున్న వారికి చెప్పి వారిని కెమెరాకు దూరంగా వెళ్లమని చెప్పాను. ఆ షూట్ జరిగినప్పుడు కొంచెం కంగారుపడ్డాను. ఏ సీన్ అయినా పెర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటాను. అయితే సినిమాలో ఆ సీన్ చూసినప్పుడు చేసింది నేనేనా అనిపించింది" అన్నారు.
రెండేళ్లుగా కష్టకాలం - అమీర్ ఖాన్ ప్రస్తుతం తన పరిస్థితిని వివరిస్తూ - నేను ఏ టీవీ షోలకు, ఈవెంట్స్ కు వెళ్లను కానీ ఈ కపిల్ శర్మ షోకు రావడానికి కారణముంది. రెండేళ్లుగా నా జీవితంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నానుయ ఈ షో చూస్తే ఎంత బాధలో ఉన్నా నవ్వు వస్తుంది అందుకే వచ్చాను" అంటూ తన మనసులో మాట చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహేశ్‌ను నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? - Mahesh babu Namratha
రెండో బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ - శ్రుతిహాసన్ అందుకే స్పందించలేదా? - Shruti Hassan Sanatanu Hazarika