ETV Bharat / entertainment

'ఓవర్ చేయకు'- హరీశ్ శంకర్​కు రవితేజ స్వీట్ వార్నింగ్! - Ravi Teja Harish Shankar - RAVI TEJA HARISH SHANKAR

Ravi Teja Harish Shankar: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ- దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మధ్య తాజాగా ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్​గా మారింది.

ravi teja harish shankar movies
ravi teja harish shankar movies (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 2:37 PM IST

Ravi Teja Harish Shankar: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ- డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కశ్మీర్​లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే అప్పుడప్పుడు ట్వీట్లతో అలరించే డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారారు. తాజాగా హీరో రవితేజను ఉద్దేశిస్తూ ఫన్నీగా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్​ మీడియాలో ట్రెండింగ్​గా మారింది. అసలేం జరిగిందంటే?

కశ్మీర్ లొకేషన్​లో రవితేజ దిగిన ఓ ఫొటోను డైరెక్టర్ ట్విట్టర్​లో షేర్ చేశారు. బెంచ్​పై స్టైలిష్​గా కూర్చున్న రవితేజ ఫొటోను షేర్ చేసి 'ప్రపంచకంలో అందరికీ వయసొస్తోంది.అన్నయ్యకి తప్ప' అని ఆయనను ఉద్దేశిస్తూ పోస్ట్​ చేశారు. అయితే దీనిపై రవితేజ తనదైన స్ట్రైల్​లో స్పందించారు. 'ఓవర్ చేయకురోయ్. నీ దిష్టే తగిలేలా ఉంది' అని ఫన్నీగా రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్​ను మాస్ మహారాజ ఫ్యాన్స్​ తెగ ట్రెండ్ చేస్తున్నారు. 'ఏం టైమింగ్ అన్నా', 'ఇది ఎనర్జీ అంటే' అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే, ఇటీవల మూవీ నుంచి 'షో రీల్' పేరుతో ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ యాక్షన్​తో ఉన్న ఈ గ్లింప్స్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ యక్షన్ సన్నివేశాలతో ఈ గ్లింప్స్​ను డిజైన్ చేశారు. ఈ వీడియో గ్లింప్స్​తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యూట్యూబ్​లో ఇప్పటికే ఈ వీడియో 1 మిలియన్ వ్యూస్ దాటేసింది.

రవితేజ సరసన హీరోయిన్​గా భాగ్యశ్రీ బొర్సే నటించనుంది. ఈమె ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. సీనియర్ నటుడు జగపతి బాబు విలన్​ రోల్​లో నటిస్తున్నారు. ఇంక మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై వివేక్ కుచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. మూవీ రిలీజ్​పై ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

'మిస్టర్ బచ్చన్' షో రీల్​​ ఔట్- రవితేజ మాస్ జాతర- ఫ్యాన్స్​కు పూనకాలే - Mr Bachan Glimps

'మిస్టర్​ బచ్చన్​' అప్డేట్​- మిలియన్​ థాంక్స్​​ అంటూ డైరెక్టర్​ ట్వీట్​​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.