ETV Bharat / entertainment

నా కష్టానికి ప్రతిఫలం ఈ జాతీయ పురస్కారం : హీరోయిన్ నిత్య మేనన్‌ - 70TH NATIONAL FILM AWARDS

70th National Film Awards : జాతీయ అవార్డును రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకున్న నిత్యామేనన్, రిషభ్ శెట్టి!

Nithya Menon Rishab Shetty National Film Awards
Nithya Menon Rishab Shetty National Film Awards (source ANI And ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 6:09 PM IST

Updated : Oct 8, 2024, 7:18 PM IST

70th National Film Awards : 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందజేస్తున్నారు. 'కార్తికేయ 2' దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. కన్నడ నటుడు రిషభ్ శెట్టి, నిత్యా మేనన్​ కూడా పురస్కార్వాన్ని స్వీకరించారు. మరోవైపు, మిథున్‌ చక్రవర్తి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం స్వీకరించారు.

కాగా, 2022కి గానూ కేంద్రం రీసెంట్​గానే ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది. ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతార), ఉత్తమ నటిగా నిత్యా మేనన్‌ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్‌' (మలయాళం), తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచిన సంగతి తెలిసిందే.

Thiruchitrambalam Nithya Menon National Award : ఇకపోతే జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కడంపై నటి నిత్య మేనన్‌ ఈ వేడుకలో స్పందించారు. అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. "నేషనల్‌ అవార్డు నా కష్టానికి ప్రతిఫలం. 10-15 ఏళ్లుగా చిత్ర సీమలో కొనసాగుతున్నాను. ఇది నేను సంబరాలు చేసుకోవాల్సిన సమయం" అని అన్నారు. మంచి స్క్రిప్ట్‌తో వచ్చిన దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని నిత్య మేనన్‌ చెప్పారు. ఈ అవార్డును తన తోటి కోస్టార్స్​కు, తిరుచిత్రంబలం మూవీటీమ్​కు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సినిమాకు బోర్డర్‌ లేదు(AR Rahman National Award) - 'పొన్నియిన్‌ సెల్వన్‌- 1' చిత్రానికి గానూ ఉత్తమ సంగీతం (నేపథ్యం) విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత రెహమాన్ మాట్లాడుతూ - "ప్రాంతం, భాష, సినిమాకు ఎలాంటి హద్దులు లేవు. నా ఏడో జాతీయ అవార్డు ఇది. దీనికి కారకులైన ఫిల్మ్‌ మేకర్స్‌, ముఖ్యంగా దర్శకుడు మణిరత్నానికి నా ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చారు.

'పుష్ప 2' అదిరే అప్డేట్​ - తుపాను సృష్టించడానికి సిద్ధం!

పవన్ కల్యాణ్​పై బాలీవుడ్ స్టార్ యాక్టర్​ ప్రశంసలు - ఏం అన్నారంటే?

Last Updated : Oct 8, 2024, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.